Breaking News

ఈ ఏడాది డిమాండ్‌ ఉండే ఏఐ మోడళ్లు

Published on Sat, 01/04/2025 - 20:36

భవిష్యత్తులో చిన్న, డొమైన్ ఫోకస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడళ్లకు డిమాండ్‌ ఏర్పడుతుందని టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు తెలిపారు. చిన్న మోడళ్లు తక్కువ వనరులను వినియోగిస్తాయని, దాంతోపాటు సమర్థంగా పనిచేస్తాయని, వేగంగా ఫలితాలు అందిస్తాయని చెప్పారు. ఇంధన వ్యయాలను తగ్గించుకోవాలని, చిన్న మాడ్యులర్‌ రియాక్టర్లు(ఎస్‌ఎంఆర్‌) వంటి ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన నొక్కి చెప్పారు.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)-తిరుచ్చి పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2023లో లార్జ్‌ లాంగ్వేజీ మోడల్స్‌కు(ఎల్ఎల్ఎం) మంచి అవకాశం వచ్చింది. కానీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దాంతో 2024లో మల్టీమోడల్ ఏఐలకు అపారమైన అవకాశాలు వచ్చాయి. 2025లో ఇందుకు భిన్నంగా స్మాల్‌ ల్యాంగ్వేజీ మోడళ్లకు భారీగా డిమాండ్‌ రానుంది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: యాపిల్‌ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావా

గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సవాళ్లను ప్రస్తావిస్తూ పారిశ్రామిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల వినియోగం పెరగడం వల్ల ప్రపంచ ఇంధన అవసరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి పెరగాలంటే ఇంధన వ్యయాలు తగ్గించుకోవాలన్నారు.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)