Breaking News

ఆఫీస్‌కు రాకపోతే వేరే ఉద్యోగం చూసుకోండి..

Published on Fri, 05/16/2025 - 15:05

రిమోట్ వర్క్.. అదేనండి వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌. చాలా మంది ఉద్యోగులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఓపక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే మరో వైపు ఉద్యోగాన్ని చూసుకుంటున్న వారికి ఈ విధానం చాలా అనువుగా ఉంటోంది. అయితే కోవిడ్-19 మహమ్మారి విజృంభణ సందర్భంగా అమలులోకి వచ్చిన ఈ రిమోట్‌ వర్క్‌ విధానం నెమ్మదిగా తొలగిపోతోంది. చాలా కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలుస్తున్నాయి.

సౌకర్యవంతమైన ఈ వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానానికి అలవాటు పడినవారు ఆఫీసులకు తిరిగివెళ్లడానికి ఇష్టపడటం లేదు. చాలా కంపెనీలు ఉద్యోగులను బలవంతంగానైనా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. ఇలాగే ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించడం ఓ ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీలో ఎలా బెడిసికొట్టిందో.. ఉద్యోగులు ఏం చేశారో చెబుతూ ఆ కంపెనీలో పనిచేసే వ్యక్తి రెడ్డిట్‌లో షేర్‌ చేసిన స్టోరీ ఆసక్తికరంగా మారంది.

ఆఫీస్‌కు రాకపోతే ఏం చేస్తారు?
కోవిడ్‌ సమయంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ అమలు చేసిన కంపెనీ.. ఆ సమయంలో చాలా మందిని రిమోట్‌ వర్క్‌ విధానంలోనే నియమించుకుంది. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అందరూ క్రమంగా ఆఫీసులకు రావాలని యాజమాన్యం ఆదేశించింది. అసలు సమస్య ఏంటంటే.. దాదాపు చాలా మంది రిమోట్‌ వర్క్‌ విధానంలోనే ఉద్యోగాల్లో చేరారు. కొంత మంది తమ ప్రాంతాలకు మకాం మార్చారు. ఇప్పుడు వీళ్లకు ఎటువంటి ఆర్థిక సహకారం అందించకుండా ఏడాదిలోగా ఆఫీసులకు వచ్చేయాలని కంపెనీ చెబుతోంది.

దీంతో ఉ‍ద్యోగులు గందరగోళంలో పడిపోయారు. ఈక్రమంలో కంపెనీ వైడ్ టౌన్ హాల్ సమావేశంలో ఆఫీస​్‌కు రావడానికి అయిష్టంగా ఉన్నవారికి మినహాయింపులేమైనా ఉంటాయా అని ఓ ఉద్యోగి నేరుగా సీఈవోనే అడిగేశారు. దానికి సీఈవో స్పందిస్తూ "మీరు ఇంటి నుండి పని చేయాలనుకుంటే, వేరే చోట ఉద్యోగం చూసుకోండి" అంటూ బదులిచ్చారు. దీంతో అవాక్కైన ఉద్యోగులు ఆన్‌లైన్‌ కాల్స్‌లోకి రావడం మానేశారు. చాలా మంది వెంటనే రాజీనామా చేశారు. ఎక్కువ మంది వెళ్లిపోవడంతో కంపెనీకి షాక్‌ తగిలింది. క్యూసీ ఉ‍ద్యోగులతోనే యాప్ డెవలప్‌మెంట్ చేయించాల్సి వచ్చింది.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)