Breaking News

ఫ్లైట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అదనపు బాదుడుకు అడ్డుకట్ట

Published on Sun, 11/01/2026 - 14:06

భారతీయ విమానయాన రంగంలో ప్రయాణీకుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన టికెట్ల ధరల పెంపులో ఏకపక్ష ధోరణులకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రయాణీకులపై అదనపు చార్జీల భారాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన కొత్త విమాన చార్జీల (ఎయిర్‌ఫేర్) నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నిబంధనలకు తుదిరూపు తెచ్చింది.

నియంత్రణ లేని ధరలకు చెక్‌

ప్రైవేట్ విమాన సంస్థలు పండుగలు, సెలవుదినాలు, అత్యవసర సమయాల్లో ఇష్టానుసారం టికెట్ ధరలను విపరీతంగా పెంచుతున్నాయనే విమర్శలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. సామాజిక కార్యకర్త ఎస్.లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం నేపథ్యంలో కోర్టు జోక్యంతో కేంద్రం ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చింది. డైనమిక్ ప్రైసింగ్ పేరిట ప్రయాణీకులను దోచుకుంటున్న తీరుపై తగిన నియంత్రణ ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో ప్రభుత్వం ఈ చట్టబద్ధమైన నిబంధనలను సిద్ధం చేసింది.

ప్రయాణీకులకు లబ్ధి చేకూరే అంశాలు

కేవలం బేస్ ఫేర్ మాత్రమే కాకుండా లగేజ్ ఫీజులు, సీట్ సెలక్షన్, ఇతర అదనపు ప్రయాణీకుల చార్జీల మోతకు ఈ నిబంధనల ద్వారా అడ్డుకట్ట పడనుంది. విమానయాన సంస్థలు టికెట్ల ధరల నియంత్రణలో మరింత పారదర్శకత పాటించేలా నిబంధనలను రూపొందించారు. విమానాల రాకపోలకు అంతరాయం ఏర్పడినప్పుడు లేదా విపరీతమైన ధరల పెరుగుదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకునేలా నిబంధనల్లో వెసులుబాటు కల్పించారు. ఈ నూతన నిబంధనలకు సంబంధించి ఇప్పటికే పరిపాలనాపరమైన ఆమోదం లభించిందని, త్వరలోనే అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుందని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు వెల్లడించింది.

ఇదీ చదవండి: బంగారం చిన్నబోతోందెందుకో తెలుసా?

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)