Breaking News

భారత్ రైస్ వస్తోంది.. కేజీ ధర ఎంతంటే?

Published on Wed, 12/27/2023 - 15:51

రోజు రోజుకి పెరుగుతున్న బియ్యం ధరలను పరిష్కరించడానికి ప్రభుత్వం భారత్ బ్రాండ్‌తో కేవలం 25 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన విషయాలను సంబంధిత ఉన్నతాధికారి ఒకరు ధృవీకరించినట్లు సమాచారం.

భారత్ రైస్ అనేది నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (ఎన్‌సిసిఎఫ్), కేంద్రీయ భండార్ అవుట్‌లెట్‌ల ద్వారా విక్రయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ అట్టా, భారత్ దాల్ (పప్పు) వంటి వాటిని విక్రయిస్తున్న ప్రభుత్వం రైస్ విభాగంలోకి అడుగుపెట్టింది.

బాస్మతియేతర బియ్యం ధరల నియంత్రణకు చర్యలు
గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో బాస్మతియేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ 'సంజీవ్ చోప్రా' (Sanjeev Chopra) ప్రముఖ రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యారు.

ఇదీ చదవండి: అప్పుడు ఆస్తి పోగొట్టుకున్నాడు.. ఇప్పుడు రూ.37000 కోట్ల సామ్రాజ్యం.. 

ఈ సమావేశంలో సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. బాస్మతియేతర బియ్యం ధరలు సజావుగా (రీజనబుల్) ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద 29 రూపాయలకే ప్రాసెసర్లకు అందజేస్తున్నారు. అయితే ఇదే బియ్యాన్ని వారు మార్కెట్లో రూ.43 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదేశాలను జారీ చేయడం జరిగిందని వెల్లడించారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)