Breaking News

రైతులకు శుభవార్త.. ఉచిత రేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం?

Published on Mon, 01/08/2024 - 15:49

ఏప్రిల్‌- మే 2024 నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం- కిసాన్‌ సమ్మాన్‌ ప్రత్యక్ష బదిలీ మొత్తాన్ని పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో రైతుకు ప్రస్తుతం అందించే రూ.6,000 మొత్తాన్ని రూ.8,000కు పెంచే అవకాశం ఉందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

దీంతో పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందించే ఉచిత రేషన్‌ బియ్యాన్ని మరిన్ని కేజీలు పెంచడాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోందని, తుది నిర్ణయం త్వరలో తీసుకోనుందని నివేదికలు పేర్కొన్నాయి.  

16 విడుత విడుదల ఎప్పుడంటే?
ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నెలలో పీఎం కిసాన్‌ పథకం 16వ విడుతను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, దీనికి సంబంధించి కేంద్రం ఎలాంటి అధికారికంగా తెలపలేదు. ఈ పథకం 15వ విడతను నవంబర్ 15, 2023న కేంద్రం విడుదల చేసింది.

ఎంఎస్‌ఎంఈలకు అండగా 
ఇదిలా ఉండగా, 2024 మధ్యంతర బడ్జెట్‌లో పేదలు, రైతులు, యువత, మహిళలకు అదనపు సహాయక చర్యలను అందించాలని కేంద్రం భావిస్తోంది. నివేదిక ప్రకారం..  సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలకు (msme) అందించే ఆర్థిక సహాయాన్ని మరింత పెంచనున్నట్లు సమాచారం.  

2018 నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ
దేశంలోని రైతులకు సాయం కింద 2018 నుంచి ఏటా రూ.6 వేల చొప్పున కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తుంది. రూ.2వేలు చొప్పున మూడు విడతలుగా ఏడాదికి రూ.6వేల చొప్పున అర్హులైన రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. 

5 కిలలో ఆహార ధాన్యాలు 
2020లో కోవిడ్ మహమ్మారి సమయంలో పేదలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇందుకోసం డిసెంబర్ 2022లో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద, గరీబ్ కళ్యాణ్‌ అన్నా యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)