Breaking News

41 వేల ఖాతాల్లో రూ.820 కోట్లు జమ.. ప్రముఖ బ్యాంకులో సీబీఐ సోదాలు

Published on Fri, 03/08/2024 - 09:46

యూకో బ్యాంక్‌లో గతంలో జరిగిన ఇమిడియట్ పేమెంట్ సిస్టమ్(ఐఎంపీఎస్‌) లావాదేవీల కుంభకోణంలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) విచారణ జరుపుతోంది. తాజాగా రాజస్థాన్, మహారాష్ట్రల్లోని 67 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.

అసలేం జరిగిందంటే..

బ్యాంకులో గతేడాది నవంబరు 10-13 తేదీల మధ్య యూకో బ్యాంక్‌కు చెందిన 41 వేల మందికి పైగా ఖాతాదార్ల అకౌంట్‌ల్లోకి తప్పుగా డబ్బులు జమైనట్లు బ్యాంకు అధికారులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలా జమ అయిన మొత్తం నిధుల విలువ రూ.820 కోట్లని తేల్చింది. 7 ప్రైవేటు బ్యాంకుల్లోని 14,600 ఖాతాదారుల నుంచి ఐఎంపీఎస్ లావాదేవీల ద్వారా యూకో బ్యాంకులోని 41,000కు పైగా ఖాతాదారులకు తప్పుగా నిధులు జమ అయినట్లు సీబీఐ గుర్తించింది. ఆసక్తికర విషయం ఏమిటంటే.. సంబంధిత బ్యాంకు ఖాతాల్లో మాత్రం డబ్బులు కట్ అవకుండానే, యూకో బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్లలోకి డబ్బు జమైనట్లు గుర్తించారు. 

ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

బ్యాంకు ఖాతాల్లో పొరపాటున నగదు జమ అయిన తేదీల్లోనే, యూకో బ్యాంకులో వేల సంఖ్య లో కొత్త ఖాతాలు తెరుచుకోవడంపై ఆరా తీస్తున్నారు. తమ ఖాతాల్లో జమ అయిన డబ్బును చాలామంది విత్‌డ్రా చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల నిర్వహించిన దాడుల్లో యూకో బ్యాంకు, ఐడీఎఫ్సీకి చెందిన 130 నేరారోపణ పత్రాలు, 40 మొబైల్ ఫోన్లు, రెండు హార్డ్‌ డిస్క్‌లు, ఇంటర్నెట్ డాంగుల్‌ను ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం సీజ్ చేసినట్లు సీబీఐ తెలిపింది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)