Breaking News

వేలకోట్ల బ్యాంక్ ఫ్రాడ్‌.. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ధీరజ్ వాధావన్ అరెస్ట్‌

Published on Tue, 05/14/2024 - 21:33

రూ. 34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) మాజీ డైరెక్టర్‌ ధీరజ్‌ వాధవాన్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. వాధవాన్‌ను సోమవారం సాయంత్రం ముంబైలో అదుపులోకి తీసుకున్నామని, మంగళవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు సీబీఐ అధికారులు ధృవీకరించారు.  

బ్యాంకులను రూ.34,615 కోట్ల మేర మోసం చేసిన కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మాజీ ప‍్రమోటర్లపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకుల కన్సార్టియంలను మోసం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సీబీఐ అధికారులు డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు ధీరజ్ వాధవాన్, కపిల్ వాధవాన్‌లపై కేసులు నమోదు చేశారు.  

ఎస్‌ బ్యాంక్ అవినీతి కేసులో అరెస్ట్‌  
ఈ కేసుకు సంబంధించి 2022లో ధీరజ్‌ను సీబీఐ చార్జిషీట్‌లో చేర్చింది. ఎస్‌ బ్యాంక్ అవినీతి కేసులో వాధావాన్‌ను గతంలో సీబీఐ అరెస్ట్‌ చేస్తే బెయిల్‌పై విడుదలైనట్లు అధికారులు తెలిపారు. 

దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్‌ కుంభకోణంగా 
వాధావాన్‌ అరెస్ట్‌పై 17 బ్యాంకుల కన్సార్టియంను రూ.34,000 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై సీబీఐ డీహెచ్‌ఎఫ్‌ఎల్ కేసు నమోదు చేసిందని, ఇది దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ లోన్‌ కుంభకోణంగా నిలిచిందని సీబీఐ అధికారులు పేర్కొన్నారు

నేరపూరిత కుట్రకు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను మోసం చేయడానికి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్లు కపిల్ వాధావన్, ధీరజ్ వాధవన్ ఇతర నిందితులు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఈ కుట్రలో భాగంగా వాధవాన్‌లు రూ. 42,871.42 కోట్ల భారీ రుణాలను మంజూరు చేసేందుకు కన్సార్టియం బ్యాంకులను ప్రేరేపించారని ఏజెన్సీ తెలిపింది.

నిందితులు డీహెచ్‌ఎఫ్‌ఎల్ లెక్కల్ని తారుమారు చేసింది. ఆ నిధుల్ని వినియోగించడం, దుర్వినియోగం చేశారు. కన్సార్టియం బ్యాంకుల చట్టబద్ధంగా బకాయిలను తిరిగి చెల్లించడంలో విఫలమయ్యారని సీబీఐ అధికారులు వెల్లడించారు. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)