Breaking News

ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌లను విడుదల చేసిన ఐటీ శాఖ!

Published on Mon, 02/20/2023 - 09:22

మార్చి 31తో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు కొత్త బడ్జెట్‌కు సంబంధించిన ఆలోచనలు, సమావేశాలు, సంప్రదింపులు, ప్లానింగ్‌ విషయాలు .. మొదలైన వాటిని పక్కన పెట్టండి. 2023 ఏప్రిల్‌ 1 నుంచి వాటి గురించి ఆలోచిద్దాం. ఈలోగా 2023 మార్చి 31లోపల మనం ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ఆలోచనలు, సమాలోచనలు, ప్లానింగ్‌ ఆలోచిద్దాం.  

2023 మార్చి 31తో పూర్తయ్యే ఆర్థిక సంవత్సరానికి కొంత మందికి గడువు తేదీ 31–07–2023; మరికొందరికి సెప్టెంబర్‌ నెలాఖరు. అందుకు గాను ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 10న కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో మీరు మార్చి నెల తర్వాత డిపార్టుమెంటు వారికి దాఖలు చేయాల్సిన రిటర్నుల గురించి .. ఫారమ్‌లు, వాటిని దాఖలు చేసినప్పుడు మీకు వచ్చే అక్నాలెడ్జ్‌మెంట్‌ గురించి.. నోటిఫై చేశారు.  

►ఈ ఫారాలు 01–04–2023 నుండి అమల్లోకి వస్తాయి. 

►డిపార్టుమెంట్‌ వారి భాష ప్రకారం 2023–24 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి వర్తించేవి అనాలి. 

►ఈ ఫారాలు ఏమిటంటే..ఐటీఆర్‌ 1 సహజ్, ఐటీఆర్‌ 2, ఐటీఆర్‌ 4 సుగమ్, ఐటీఆర్‌ 5,ఐటీఆర్‌ 6
 
►పైన పేర్కొన్న ఫారాలు దాఖలు చేస్తే మీకు వచ్చే ఐటీ అక్నాలెడ్జ్‌మెంటు ఐటీఆర్‌విని కూడా నోటిఫై చేశారు. 

► అన్ని ఫారాల్లోనూ షెడ్యూళ్లు ఉన్నాయి. 

►2022 అక్టోబర్‌లోనే రూల్స్‌ విడుదల చేశారు. 

►ఉద్యోగస్తులకు సర్క్యులర్‌ డిసెంబర్‌లోనే విడుదల చేశారు.  

►‘‘డౌన్‌లోడ్స్‌’’ కింద ఐటీఆర్‌ ఆఫ్‌లైన్‌ యుటిలిటీ ద్వారా ఆఫ్‌లైన్‌ సదుపాయం ఉంది. 

►సాంకేతికంగా సులువుగా, త్వరగా వేసేలా తగిన చర్యలు తీసుకున్నారు. 

►ప్రస్తుతం ఒకొక్కప్పుడు తప్పులు దొర్లుతున్నాయి. ‘డేటా’ .. అంటే సమాచారమనేది సిస్టంలోకి ప్రీ–ఫిల్‌ అవడం లేదు. పూర్తి సమాచారం లేదని చూపుతోంది. 

►ఎక్సెల్‌ వెర్షన్‌లో ‘సబ్మిట్‌’కి ఎక్కువ వ్యవధి తీసుకుంటోంది. 

►షెడ్యూల్స్‌ నింపేటప్పుడు కొన్ని తప్పులు దొర్లుతున్నాయి. షెడ్యూల్స్‌ ఎంపిక చేసేటప్పుడు గందరగోళం, గజిబిజి ఏర్పడుతోంది. స్పష్టత ఉండటం లేదు. ఒక్కొక్కప్పుడు మొరాయిస్తోంది.  

►    ఇలాంటివి ఉండవని ఆశిద్దాం. 

►    మీరు స్వయంగా వేసుకుంటే మీ స్వంత అనుభవాన్ని మించిన పాఠం లేదు. 

►    వృత్తి నిపుణులకి ఇస్తే సమగ్ర సమాచారాన్ని సకాలంలో ఇవ్వండి.  

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)