Breaking News

అద్దెకుండాలా.. ఇల్లు కొనాలా .. ఏది లాభం?

Published on Fri, 04/07/2023 - 09:10

సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలని నిజం చేసుకునేందుకు జీవిత కాలం కష్టపడుతుంటారు. చివరికి తమ కలల సౌధాన్ని నెరవేర్చుకుంటారు. అయితే గత ఐదేళ్లుగా దేశంలోని ప్రధాన నగరాల్లో పెరిగిపోతున్న అద్దెలు, ఇళ్ల ధరలు.. సొంతింటి కలను దూరం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బెంగళూరు.. ప్రాపర్టీలు, రెంట్లు ఆకాశాన్ని తాకుతున్న నగరాల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్నట్లు బ్లూమ్‌ బెర్గ్‌ రిపోర్ట్‌ నివేదించింది. 

ఈ తరుణంలో బెంగళూరుకు చెందిన ‘కేపిటల్‌ మైండ్‌’ ఫౌండర్‌, సీఈవో దీపక్‌ షెనాయ్ (Deepak Shenoy) ఇంటి కొనుగోలుపై పెట్టే పెట్టుబడిని ‘భయంకరమైన పెట్టుబడి’గా అభివర్ణించారు. ఇల్లు, కారు కొనుగోలు చేయడం మంచిది కాదన్నారు. సొంత ఇల్లు కొనుగోలుతో ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. సొంతంగా కారు కొనుక్కునే బదులు.. ఓలా, ఊబర్‌ లాంటి సర్వీసుల్ని వినియోగించుకోవచ్చని అన్నారు.  

కానీ కొనుగోలు, అద్దె ఈ రెండూ ఎప్పటికి పోవు. ఎందుకంటే ఎక్కువ మంది దృష్టిలో ఆ రెండు ఓ విశ్వాసం లాంటివి. అందుకే చాలా మంది ఇల్లు, కార్లకు యజమానులవ్వాలని అనుకుంటారు. ఒక్కోసారి కారు కొన్నట్లు ఇల్లు కొనుగోలు చేయొచ్చా? అని ఆలోచిస్తుంటారు. మరికొందరు పెట్టుబడులతో ఇల్లు కొనుగోలు విషయంలో గందరగోళానికి గురవుతారని ట్వీట్‌ చేశారు. అయితే గత దశాబ్దంలో ఇళ్ల కొనుగోళ్లతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కార్ల తరహాలో ఇళ్ల కొనుగోళ్లు ఓ భయంకరమైన పెట్టుబడి. కానీ  సొంత ఇల్లు ఉంటే మనకు నచ్చిన విధంగా అందంగా అలంకరించుకోవచ్చు. పాస్‌పోర్ట్‌లో పర్మినెంట్‌ అడ్రస్‌ కింద అప్లయి చేసు కోవచ్చు. రెంట్‌ కట్టే బాధతప్పుతుంది. అద్దె ఇల్లు కోసం మీడియేటర్లతో సంప్రదింపులు జరిపే అవసరం ఉండదనే భావనలో ఉంటారని.. కానీ సొంత ఇల్లు కొనుగోలు చేయడం సమర్ధించే పెట్టుబడి కాదని అన్నారు దీపక్‌ షెనాయ్‌. 

ప్రస్తుతం దీపక్‌ షెనాయ్‌ వ్యక్తం చేసిన ట్వీట్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన వ్యాఖ్యలు సొంత ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి ఆశలకు దూరం చేస్తున్నాయంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి👉 ఆర్‌బీఐ కీలక ప్రకటన..బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)