Breaking News

విడాకులు తీసుకుంటే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది!.. ఎలా అంటే?

Published on Sun, 04/20/2025 - 17:23

ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకునేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కారణం ఏదైనా విడాకులు వరకు వెళ్లిపోతున్నారు. డివోర్స్ తీసుకుంటే ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉన్నా.. క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది వినడానికి వింతగా అనిపించినప్పటికీ, ఈ కథనం చదివితే.. తప్పకుండా మీకే అర్థమవుతుంది.

భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు (ఉద్యోగం చేసే వారైతే).. జాయింట్ అకౌంట్స్ మీద హోమ్ లోన్, వెహికల్ లోన్ వంటివి తీసుకుని ఉంటే.. విడాకులు తరువాత ఈ ఖాతాలను క్లోజ్ చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఎలా అంటే.. జాయింట్ అకౌంట్స్ కింద తీసుకున్న లోన్‌కు ఇద్దరూ బాధ్యత వహించాలి. ఆలా కాకుండా అకౌంట్ క్లోజ్ చేస్తే లేదా లోన్ చెల్లింపులు ఆలస్యం చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది.

కలిసి ఉన్నప్పుడు ఇద్దరి సంపాదన తోడవుతుంటుంది. విడాకుల తరువాత ఎవరి దారి వారిదే. అలాంటి సమయంలో ఆర్ధిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఇది మీ ఈఎంఐల మీద ప్రభావం చూపిస్తుంది. ఇది కూడా సిబిల్ స్కోర్ తగ్గిపోవడానికి కారణమవుతుంది.

ఇదీ చదవండి: ఫుడ్‌ ఆర్డర్‌తో పాటు ఓ స్లిప్‌ పంచుతున్న డెలివరీ బాయ్‌.. అందులో ఏముందంటే?

విడాకులు మంజూరు చేసే సమయంలో లోన్స్ క్లియర్ చేయాల్సిన బాద్యతను మీ భాగస్వామికి కోర్టు అప్పగించినప్పటికీ.. లోన్ అగ్రిమెంట్స్ మీద ఇద్దరి సంతకాలు ఉంటాయి. అలాంటి సమయంలో మీ భాగస్వామి చెల్లింపులను ఆలస్యం చేస్తే.. ఆ ప్రభావం ఇద్దరిపైన పడుతుంది. ఇది సిబిల్ స్కోర్ తగ్గడానికి కారణమవుతుంది.

జాయింట్ అకౌంట్స్ లేదా క్రెడిట్ కార్డులను విడాకులు తీసుకున్న వెంటనే క్లోజ్ చేసుకున్నట్లయితే.. అది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి విడాకులు తీసుకున్న తరువాత కూడా ఇలాంటి ఆర్ధిక సంబంధ లావాదేవీల గురించి మాట్లాడుకుంటే.. సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకోవచ్చు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)