Breaking News

ఈ క్యాబ్‌ ఎక్కితే దిగరు..!

Published on Fri, 01/31/2025 - 21:39

సాధారణంగా మీరు క్యాబ్‌ని (cab) బుక్ చేసుకుని ఎక్కగానే ఎంత త్వరగా గమ్యస్థానాన్ని చేరుకుంటామా అని ఆలోచిస్తారు. కానీ ఢిల్లీలోని అబ్దుల్ ఖదీర్ ఉబెర్‌ (Uber) క్యాబ్‌లోకి అడుగు పెడితే రైడ్ ముగియాలని కోరుకోకపోవచ్చు! ఎందుకంటే స్నాక్స్, నీరు, వై-ఫై, పెర్ఫ్యూమ్‌లు, మందులు, హ్యాండ్‌హెల్డ్ ఫ్యాన్‌లు, టిష్యూలు, శానిటైజర్‌లు, యాష్‌ట్రే ఒకటేమిటి అన్నీ సౌకర్యాలు ఈ క్యాబ్‌లోనే ఉన్నాయి. దీనిపై రెడ్డిట్‌లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్‌గా మారింది.

అబ్దుల్ ఖదీర్ కేవలం రైడ్ మాత్రమే అందించడం లేదు. బిజినెస్‌ క్లాస్‌ ఫ్లైట్‌లో (business class flight) ఉండే లాంటి లగ్జరీ అనుభూతిని ఇస్తున్నాడు. పైగా క్యాబ్‌లో అతడు అందిస్తున్న ప్రతిదీ ఉచితం. ఇది సాధారణ టాక్సీ కంటే విలాసవంతమైన లాంజ్ లాగా అనిపిస్తుంది. తన క్యాబ్ ఫోటోను షేర్ చేసిన ఓ ప్రయాణికుడు.. "విమానాల కంటే క్యాబ్ సౌకర్యాలు మెరుగ్గా దొరికాయి!" అని చమత్కరించాడు.

క్యాబ్‌లో ప్రయాణికులకు ఖ‌దీర్ అందిస్తున్న విశిష్ట క‌స్ట‌మ‌ర్ సేవ‌ల‌పై  సోష‌ల్ మీడియా యూజ‌ర్లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. కస్టమర్ల పట్ల ఖదీర్‌కు ఉన్న శ్రద్ధ అతనిని ఎంతగానో పాపులర్ చేసింది. ఎప్పుడు క్యాబ్‌ అవసరం వచ్చినా అతని క్యాబ్‌నే బుక్‌ చేసుకుంటామంటున్నారు చాలా మంది. కొంతమంది అయితే ఖదీర్‌ అందిస్తున్న సౌకర్యాలకు అదనంగా చెల్లిస్తామని కూడా చెబుతన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)