Breaking News

ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఇల్లు కొనడం మంచి నిర్ణయమేనా?

Published on Mon, 05/26/2025 - 07:37

అంతర్గతంగా విలువ దాగి ఉన్న స్టాక్స్‌ను గుర్తించడం ఎలా?     – కపిల్‌ శర్మ

వాస్తవ విలువ కంటే తక్కువలో ట్రేడ్‌ అవుతున్న (అండర్‌ వ్యాల్యూడ్‌) స్టాక్‌ను గుర్తించం అన్నది ఒక కళ. డిస్కౌంటింగ్‌ సూత్రాన్ని ఇక్కడ అమలు చేసి చూడాల్సి ఉంటుంది. అంటే వచ్చే ఐదు, పదేళ్ల కాలంలో కంపెనీ ఆదాయాలు ఏ మేరకు వృద్ధి చెందుతాయో గుర్తించి, ఆ మేరకు చెల్లించేందుకు ముందుకు రావడం. ఇక్కడ ఎన్నో అంశాలు లెక్కించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే, యాజమాన్యం ఎంత ఉత్తమమైనది? అనే అంశాన్ని కూడా చూడాలి. కంపెనీ నుంచి నిధులను మెరుగ్గా వినియోగిస్తున్నార? ప్రమోటర్లు విశ్వసనీయత కలిగిన వారేనా?  ఆయా రంగంలో కంపెనీకి వృద్ధికి అవకాశం ఉందా? అవకాశాలను అనుకూలంగా మార్చుకోగలదా? వీటిని విశ్లేషించుకోవాలి. అలాగే, ఎంపిక చేసుకున్న మెరుగైన కంపెనీల గురించి వచ్చే ప్రతికూల వ్యాఖ్యానాలను విశ్లేషించుకునే సామర్థ్యం.. తటస్థ వైఖరి కావాలి.  

నేను పెట్టుబడి దృష్ట్యా ఇంటిని కొనుగోలు చేద్దామని అనుకుంటున్నాను. ఇది మెరుగైన ఎంపికేనా?       – శివమ్‌  

ఇల్లు అన్నది కేవలం నివాసం కోసమే. రాబడి దృష్ట్యా కాకుండా దీర్ఘకాలంలో భూముల ధరలు పెరుగుతాయన్న అంచనాలతో చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. ఒక కుటుంబ నివాస అవసరాలకే ఇల్లు. దీన్ని పెట్టుబడిగా చూడకూడదు. ఒక్కసారి ఇల్లు కొనుగోలు చేసి, దానిలో నివసిస్తుంటే విలువ పెరుగుతుందా? లేక తగ్గుతుందా అన్నది పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు.  అదే పెట్టుబడి కోణం నుంచి చూస్తే రియల్‌ ఎస్టేట్‌కు కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. అధిక మొత్తంలో పెట్టుబడి కావాల్సి ఉంటుంది. ఇతర సాధనాలతో పోలిస్తే లిక్విడిటీ (నగదుగా మార్చే సౌలభ్యం) తక్కువగా ఉంటుంది. దీంతో కోరుకున్నప్పుడు విక్రయించుకునే వీలు ఉండకపోవచ్చు. 

కొన్ని సందర్భాల్లో రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్లో సవాళ్లూ ఉంటాయి. ప్రాపర్టీని అద్దెకు ఇస్తే కిరాయిదారు రూపంలో ఆదాయం వస్తుంది. అలా చూస్తే చాలా మందికి ఇల్లు మంచి పెట్టుబడిగా కనిపిస్తుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణంతోపాటే అద్దె కూడా పెరుగుతూ వెళుతుంది. అదే సమయంలో ప్రతికూలతలూ కనిపిస్తాయి. 20 ఏళ్లు గడిచిన తర్వాత పాతదిగా మారడంతో అద్దెకు డిమాండ్‌ తగ్గుతుంది. అప్పటి వరకు వసూలు చేసినంత అధిక అద్దెకు కిరాయిదారులు ముందుకు రాకపోవచ్చు. మెరుగైన అద్దెతో అధునికమైన, కొత్త ఇంటికి వారు మొగ్గు చూపించొచ్చు.  ప్రాపర్టీ విలువ పెరిగినా, అద్దె రాబడి మెరుగ్గా ఉండదు. అందుకే ప్రాపర్టీని కొనుగోలు చేసే ముందు ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి.

సమాధానాలు: ధీరేంద్రకుమార్‌, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?