బిజినెస్‌: నష్టాల్లోంచి లాభాల్లోకి..

Published on Thu, 03/21/2024 - 08:49

ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, అధిక వెయిటేజీ రిలయన్స్‌(1.25%), ఐటీసీ(1.50%), ఎస్‌బీఐ(2%) షేర్లు రాణించడంతో సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకోగలిగాయి. అయితే రూపాయి క్షీణత, చిన్న కంపెనీల షేర్లలో అమ్మకాలు సూచీల భారీ లాభాలకు అడ్డుకట్టవేశాయి. తొలిసెషన్‌లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.

యూరప్‌ మార్కెట్ల సానుకూల ప్రారంభంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ట్రేడింగ్‌లో 729 పాయింట్ల పరిధిలో కదలాడిన సెన్సెక్స్‌ చివరికి 90 పాయింట్ల లాభంతో 72,102 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 71,674 కనిష్టాన్ని, 72,403 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 221 పాయింట్ల రేంజ్‌లో 21,931 వద్ద గరిష్టాన్ని, 21,710 వద్ద కనిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 22 పెరిగి 21,839 వద్ద నిలిచింది.

రెండు నెలల కనిష్టానికి రూపాయి..
డాలర్‌ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 83.19 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయి రెండు నెలల కనిష్టం.

ట్రస్ట్‌ ఫిన్‌టెక్‌ @ రూ.95–101
సాస్‌ ప్రొడక్ట్‌ ఆధారిత ఫిన్‌టెక్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్లు అందించే ట్రస్ట్‌ ఫిన్‌టెక్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 95–101 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది.ఆఫర్‌ ద్వారా కంపెనీ రూ. 63 కోట్లకుపైగా సమీకరించే యోచనలో ఉంది.

ఇవి చదవండి: ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)