Breaking News

యాపిల్ పెట్టుబడిపై నీలినీడలు!

Published on Tue, 04/14/2026 - 15:29

‘ఒరాకిల్ ఆఫ్ ఒమాహా’గా పిలవబడే దిగ్గజ పెట్టుబడిదారు వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్వే సీఈఓ బాధ్యతల నుంచి డిసెంబర్ 31న తప్పుకున్నప్పటి నుంచి యాపిల్‌ పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకున్నాయి. తన అర్ధ శతాబ్దపు ప్రస్థానంలో బెర్క్‌షైర్ క్లాస్-ఏ షేర్లను ఏకంగా 61,00,000 శాతం వృద్ధి పథంలో నడిపించిన బఫెట్, ఆ పగ్గాలను ఇటీవల తన వారసుడు గ్రెగ్ అబెల్‌కు అప్పగించారు. అయితే, అబెల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బెర్క్‌షైర్ అత్యంత కీలకమైన యాపిల్ పెట్టుబడి బఫెట్ నిర్దేశించిన ప్రాథమిక సూత్రాలనే ఉల్లంఘిస్తోందనే చర్చ ఆసక్తికరంగా మారింది.

విలువే ప్రాణం.. కానీ..

వారెన్ బఫెట్ పెట్టుబడి శైలిలో అత్యంత ముఖ్యమైన నియమం ‘వాల్యుయేషన్’. ఒక సంస్థకు తిరుగులేని మార్కెట్ పట్టు, సమర్థవంతమైన నాయకత్వం ఉన్నప్పటికీ ఆ సంస్థ షేరు ధర దాని అసలు విలువ కంటే ఎక్కువగా ఉంటే బఫెట్ అటువైపు చూడరు. గ్రెగ్ అబెల్ తాను రాసిన మొదటి వార్షిక లేఖలో యాపిల్‌ను తన ‘ఫరెవర్ హోల్డింగ్స్’ (ఎప్పటికీ కొనసాగించే పెట్టుబడులు) జాబితాలో చేర్చారు. కానీ ప్రస్తుత మార్కెట్ గణాంకాలను పరిశీలిస్తే యాపిల్ షేరు ధర బఫెట్ సూత్రాలకు విరుద్ధంగా చాలా ఖరీదుగా కనిపిస్తోంది.

స్తంభించిన వృద్ధి

ఇటీవలి కాలంలో యాపిల్ అమ్మకాల వృద్ధి ఆశించిన స్థాయిలో లేదు. ఐఫోన్, ఐప్యాడ్, మాక్ వంటి ఉత్పత్తుల ఆదాయం మందగించింది. కేవలం సర్వీసెస్ విభాగం మాత్రమే స్వల్ప వృద్ధిని కనబరుస్తోంది. ఏప్రిల్ 10 నాటికి యాపిల్ షేర్లు తమ ఆర్జన కంటే 33 రెట్లు (33 రెట్లు ఈపీఎస్‌-ఎర్నింగ్‌ పర్‌ షేర్‌) ఎక్కువ ధరకు ట్రేడ్ అవుతున్నాయి. 2016లో బఫెట్ తొలిసారి యాపిల్‌లో వాటాలను కొనుగోలు చేసినప్పుడు, ఆ స్టాక్ కేవలం 10 నుంచి 15 రెట్ల పీఈ రేషియోలో లభించేది. బఫెట్ సీఈఓగా ఉన్న చివరి తొమ్మిది త్రైమాసికాల్లోనే యాపిల్‌లోని సుమారు 75 శాతం వాటాను (687.6 మిలియన్ షేర్లు) విక్రయించడం గమనార్హం. కేవలం వాల్యుయేషన్ పరంగా ఆకర్షణీయంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏఐ ఆశలు వర్కౌట్ అవుతాయా?

యాపిల్ ఇంటెలిజెన్స్ ద్వారా కృత్రిమ మేధ రంగంలోకి కంపెనీ అడుగుపెట్టడం ఇన్వెస్టర్లలో కొంత ఉత్సాహాన్ని నింపినప్పటికీ అది తక్షణ ఆదాయ వృద్ధికి ఎంతవరకు దోహదపడుతుందనేది ప్రశ్నార్థకమే. యాపిల్ తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసే కార్యక్రమం(బైబ్యాక్‌) కోసం 2013 నుంచి 841 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినప్పటికీ ఆదాయ వృద్ధి లేకపోవడం పెద్ద లోపంగా కనిపిస్తోంది.

ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాలా?

గ్రెగ్ అబెల్ యాపిల్‌ను దీర్ఘకాలిక సంపద సృష్టికర్తగా చూస్తున్నప్పటికీ బఫెట్ మార్గంలోనే నడిస్తే మాత్రం రాబోయే త్రైమాసికాల్లో బెర్క్‌షైర్ తన యాపిల్ వాటాను మరింత తగ్గించుకునే అవకాశం ఉంది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కేవలం బ్రాండ్ విలువను చూసి పెట్టుబడి పెట్టడం కంటే, ఆ సంస్థ ఇచ్చే రాబడి, వాల్యుయేషన్ మధ్య సమతుల్యతను గమనించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్ వంటి దిగ్గజ సంస్థలే వృద్ధి కోసం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను పునసమీక్షించుకోవడం ఉత్తమం.

గమనిక: పై కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. షేర్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.

ఇదీ చదవండి: ‘మధ్య తరగతి’ బండి సాగేదెలా?

Videos

సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

ప్రపంచంలోనే వర్షం వస్తే నీళ్లు ఎత్తిపోసే ఏకైక రాజధాని అమరావతి

మహిళను 6 సార్లు కత్తితో పొడిచిన రాక్షసుడు..

సీఎం రేసులో కీలక నేతలు

ఆపని చేస్తే ఎప్పుడూ చూడని ఉద్యమం చూపిస్తాం, కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్

చైనా చరిత్రలో చూడని అతి పెద్ద హ్యాకింగ్ దేశ రహస్యాలు లీక్..?

ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఒక్క హార్బర్ కూడా కట్టలేదు

ఇపుడు అర్ధమయిందా కెప్టెన్సీ అంటే ఏంటో..టీమ్ ఉంటే సరిపోదు..అనుభవిస్తున్న ముంబై

డబ్బులు ఇవ్వకపోతే పరువు తీస్తానంటూ బెదిరించాడు, మలుపు తిరుగుతోన్న మంగ్లీ వివాదం

పిల్లల భవిష్యత్తు అంధకారం? బడి లేక గుడిలో చదువు..

Photos

+5

సూపర్ స్టార్ బాటలో మహేశ్ బాబు.. ఫ్యామిలీతో ఫారిన్‌ ట్రిప్స్ (ఫోటోలు)

+5

తమిళ న్యూఇయర్ స్పెషల్.. హీరోయిన్స్ ఇలా (ఫొటోలు)

+5

రుక్మిణి వసంత్ రాజస్థాన్ ట్రిప్ (ఫొటోలు)

+5

#SRHvsRR మ్యాచ్‌.. ఉప్పల్ స్టేడియంలో అందమైన భామల సందడి (ఫొటోలు)

+5

నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : పుంజుకున్న ఆరెంజ్‌ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)

+5

చీరలో శెట్టి బ్యూటీ.. అందమే అందం (ఫొటోలు)

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)