Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పెషల్ ఆఫర్‌.. 425 రోజులు అన్‌లిమిటెడ్‌..

Published on Fri, 01/03/2025 - 21:30

ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ప్రత్యేక న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద వినియోగదారులు వార్షిక ప్లాన్‌తో రీఛార్జ్ (Recharge Plan) చేసుకుంటే  425 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంతకుముందు ఈ ప్లాన్‌కి 395 రోజుల వ్యాలిడిటీ ఉండేది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ నూతన సంవత్సర ప్రత్యేక ఆఫర్ జనవరి 16 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే డేటా, కాలింగ్ ప్రయోజనాలు మునుపటిలాగే 395 రోజుల చెల్లుబాటుతో అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా నుండి ఈ ఆఫర్ గురించి సమాచారాన్ని అందించింది.

ఈ ప్రత్యేక ఆఫర్ కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ. 2,399 ప్లాన్‌పై వినియోగదారులకు 30 రోజుల అదనపు వ్యాలిడిటీని ఇస్తోంది. సాధారణంగా ఈ ప్లాన్‌కు 395 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫర్ వ్యవధిలో అంటే జనవరి 16 లోపు రీఛార్జ్ చేసుకుంటే మొత్తం 425 రోజుల పాటు 2GB రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా రోజుకు 100 SMS ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది.

ఇంత దీర్ఘకాలం చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్‌ను అందిస్తున్న ఏకైక టెలికాం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌. అన్ని ఇతర కంపెనీలు గరిష్టంగా 365 రోజుల వ్యాలిడిటీతో వార్షిక ప్లాన్‌లను అందిస్తున్నాయి. ఇవి బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లతో పోలిస్తే ఖరీదైనవి. గత సంవత్సరం ద్వితీయార్థంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలను పొందేందుకు లక్షలాది మంది వినియోగదారులు తమ నంబర్‌లను పోర్ట్ చేసుకున్నారు. గత ఏడాది ఇతర కంపెనీలు టారిఫ్‌లు పెంచేయడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ మంచి ఎంపికగా నిలిచింది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)