Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త సర్వీస్‌..

Published on Sat, 06/21/2025 - 18:44

ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త 5జీ ఇంటర్నెట్‌ సర్వీస్‌ను ప్రారంభించింది. దేశంలోనే తొలిసారి క్యూ-5జీ ఫిక్స్‌డ్‌ వైర్‌లెస్ యాక్సెస్ (Q-5G FWA) లాంచ్‌ చేసింది. ఇది సంస్థలకు, కార్యాలయాలకు సిమ్ రహిత, వైర్‌లెస్ పరిష్కారాన్ని అందిస్తుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

ఏమిటీ క్యూ-5జీ?
క్యూ-5జీ.. ఇక్కడ క్యూ అంటే క్వాంటమ్‌. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ చాలా అరుదుగా ఉండే టైర్-2, టైర్-3 నగరాలను లక్ష్యంగా చేసుకుని బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ ఎఫ్‌డబ్ల్యూఏ సేవలను ప్రారంభించింది. భారతదేశంలో అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ రూపొందించిన ఈ సరికొత్త సర్వీస్‌ వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, నెట్వర్క్ లేని నివాస ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడంలో సహాయపడుతుంది.

అయితే, ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా అందించే సాధారణ 5జీ సేవల మాదిరిగా కాకుండా బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ ఎఫ్‌డబ్ల్యూఏలో వాయిస్‌ సదుపాయం ఉండదు. అంటే దీని ద్వారా వినియోగదారులు కాల్స్ చేయలేరు. సిమ్ లేదా వైర్లు లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించే ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ మాదిరిగానే ఇది ఉంటుంది.

క్యూ-5జీ ప్లాన్‌లు
మిగిలిన వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ సర్వీసుల మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ క్యూ -5జీ తీసుకున్న కస్టమర్లకు వారి ఇళ్లపై  సీపీఈ పరికరాలను ఏర్పాటు చేస్తారు. బీఎస్ఎన్ఎల్ కొత్త క్యూ-5జీ సర్వీస్ 100 ఎంబీపీఎస్ కనీస వేగాన్ని అందిస్తుంది. ఇందుకోసం నెలకు రూ .999 ఖర్చు అవుతుంది. అదే 300 ఎంబీపీఎస్ వేగం కావాలంటే రూ.1,499 ప్లాన్ ను అందిస్తోంది.

ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ క్యూ-5జీ ఎఫ్‌డబ్ల్యూఏ హైదరాబాద్‌కే పరిమితం కాగా, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బెంగళూరు, పాండిచ్చేరి, విశాఖపట్నం, పుణె, గ్వాలియర్, చండీగఢ్ వంటి నగరాలకు ఈ సేవలను విస్తరించాలని యోచిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పటికే తెలిపింది.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)