Breaking News

ఆ మూడు కంపెనీల్లో లేని కొత్త ఫీచర్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో..

Published on Sun, 10/06/2024 - 20:52

స్పామ్, ఫిషింగ్ వంటి చర్యలతో పెరుగుతున్న ముప్పును అరికట్టడానికి ప్రభుత్వ టెలికం సం​స్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) చొరవ తీసుకుంది. కస్టమర్లకు మెరుగైన భద్రతకు భరోసానిస్తూ తన మొబైల్ యాప్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు తమకు వచ్చిన మోసపూరిత ఎస్‌ఎంఎస్‌ సందేశాలపై సులభంగా ఫిర్యాదు చేయొచ్చు.

ఈ కొత్త భద్రతా ఫీచర్‌తో హానికరమైన సందేశాల నుండి వినియోగదారులను రక్షించడానికి, వారి మొత్తం మొబైల్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ చురుకైన చర్యలు తీసుకుంటోంది. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఇటీవల టారిఫ్ పెంచిన తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్‌లలో గణనీయమైన పెరుగుదల వచ్చింది.

కొత్తగా వస్తున్న వినియోగదారులతోపాటు ఇప్పటికే ఉన్న కస్టమర్లను నిలుపుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా తమ వినియోగదారులు అవాంఛిత సందేశాలను నివేదించడానికి సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టింది. పెరుగుతున్న స్పామ్, అన్‌సోలిసిటెడ్ కమర్షియల్ కమ్యూనికేషన్ (UCC) సమస్యను పరిష్కరిస్తోంది.

ఇదీ చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త టెక్నాలజీ.. 

బీఎస్‌ఎన్‌ఎల్‌ యూసీసీ కంప్లయింట్‌ సర్వీస్‌ ద్వారా వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్ యాప్‌లో మోసపూరిత ఎస్‌ఎంఎస్‌ లేదా వాయిస్ కాల్స్‌ను నివేదించవచ్చు. ఈ ఫీచర్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే ప్రత్యేకంగా అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా వంటి ఇతర ప్రముఖ టెలికాం ఆపరేటర్‌లు ఏవీ ఇలాంటి ఫీచర్‌ను అందించడం లేదు.

కంప్లయింట్‌ ఇలా ఫైల్ చేయండి
» బీఎస్‌ఎన్‌ఎల్‌ సెల్ఫ్‌కేర్ యాప్‌ను తెరవండి.
» హోమ్ పేజీ ఎగువ ఎడమ మూలలో ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.
» కిందికి స్క్రోల్ చేసి 'కంప్లయింట్‌ అండ్‌ ప్రిఫరెన్స్‌' ఆప్షన్‌ను ఎంచుకోండి.
» తదుపరి పేజీలో కుడి వైపున ఉన్న మూడు-లైన్ మెను చిహ్నంపై నొక్కండి.
» అందుబాటులో ఉన్న ఎంపికల నుండి 'కంప్లయింట్స్‌' ఎంచుకోండి.
» 'న్యూ కంప్లయింట్‌'పై నొక్కండి.
» మీ కంప్లయింట్‌ను ఫైల్ చేయడానికి 'SMS' లేదా 'వాయిస్' ఎంచుకోండి.
» అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి మీ కంప్లయింట్‌ను సబ్‌మిట్‌ చేయండి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)