Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.. 54 రోజులు..

Published on Mon, 02/17/2025 - 16:04

ప్రభుత్వ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ఎప్పటికప్పుడు చౌక రీచార్జ్‌ ప్లాన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా కొత్త బడ్జెట్-ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఉచిత ఎస్‌ఎంఎస్‌ వంటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది.

కొత్త ప్లాన్‌ ప్రయోజనాలు
రూ. 347 ధరతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ వినియోగదారులకు ఢిల్లీ, ముంబైలోని ఎంటీఎన్‌ఎల్‌ (MTNL) ప్రాంతాలతో సహా దేశం అంతటా ఉచిత అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్‌ను అందిస్తుంది. అదనంగా, రోజుకు 2GB హై-స్పీడ్ డేటాను, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లను యూజర్లు ఆనందించవచ్చు.

ఈ ప్లాన్ 54 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదనపు బోనస్‌గా బీఐటీవీ (BiTV)కి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను అందుకుంటారు. ఇది 450 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లు, వివిధ రకాల OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.

నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా సేవలను మెరుగుపరచడంపై బీఎస్‌ఎన్‌ఎల్‌ దృష్టి సారిస్తోంది. కంపెనీ 65,000 కొత్త 4జీ టవర్లను విజయవంతంగా అమలులోకి తెచ్చింది. దేశం అంతటా తమ వినియోగదారులకు మెరుగైన కనెక్టివిటీని అందించేందుకు ఈ సంఖ్యను త్వరలో లక్షకు పెంచాలని యోచిస్తోంది.

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ఆపరేటర్‌ను పునరుద్ధరించే ప్రయత్నంలో, మెరుగైన సర్వీస్ డెలివరీని లక్ష్యంగా చేసుకుని బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఇటీవల రూ. 6,000 కోట్ల ప్యాకేజీని ఆమోదించింది.

బీఎస్‌ఎన్‌ఎల్‌కు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే విస్తృత ప్రయత్నంలో ఇది భాగం. ఇటీవలి సంవత్సరాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్ధరణ కోసం ప్రభుత్వం రూ.3.22 లక్షల కోట్ల సాయాన్ని ప్రకటించింది. 2007 తర్వాత మొదటిసారిగా బీఎస్‌ఎన్‌ఎల్‌ లాభాల్లోకి వచ్చింది. 2025 ఆర్థిక సంవ్సతరం మూడవ త్రైమాసికంలో రూ.262 కోట్ల నికర లాభాన్ని నివేదించింది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)