Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త రీఛార్జ్ ప్లాన్‌.. ఏడాదంతా..

Published on Sat, 11/02/2024 - 15:49

ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. దేశంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచిన తర్వాత చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో మరింత మంది యూజర్లను ఆకట్టుకునేందుకు ఏడాదిపాటు ప్రయోజనాలు అందించే చౌకైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.

చౌకైన రీఛార్జ్ ప్లాన్
బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 1,198. ఈ రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు 365 రోజులు లేదా 12 నెలలు. ఇక ఇతరర ప్రయోజనాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కు అయినా కాల్ చేయడానికి వినియోగదారులకు ప్రతి నెలా 300 ఉచిత నిమిషాలు లభిస్తాయి. అలాగే ప్రతి నెలా 3GB హై స్పీడ్ 3G/4G డేటాను పొందుతారు. ఇది మాత్రమే కాదు.. ఈ ప్లాన్‌లో ప్రతి నెలా 30 ఉచిత SMSల సౌకర్యాన్ని కూడా ఆనందివచ్చు.

ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. మరో మైలురాయి!

ధర తగ్గిన మరో ప్లాన్‌ 
కొత్త ప్లాన్‌ను ప్రారంభించడంతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ తన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్‌లలో మరొకదాని ధరను కూడా తగ్గించింది. రూ. 1999 ప్లాన్‌ ధరను రూ. 100 తగ్గించి ఇప్పుడు రూ. 1899కే అందిస్తోంది. ఈ ప్లాన్ బెనిఫిట్స్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 600GB డేటా, ప్రతిరోజూ 100 ఉచిత SMS వంటి ఉన్నాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)