Breaking News

BSNL Layoffs: 19,000 మంది ఉద్యోగులకు గండం

Published on Sat, 12/28/2024 - 15:50

ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL)వేలాది ఉద్యోగులను ఇంటికి పంపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కొత్త స్వచ్ఛంద పదవీ విరమణ ప్రణాళిక.. వీఆర్‌ఎస్ 2.0ని (VRS 2.o) ప్రతిపాదించింది. సంస్థ ఆర్థిక సమతుల్యతను మెరుగుపరుచుకోవడానికి ఉద్యోగుల తగ్గింపును (Layoff) ప్రకటించింది. బీఎస్‌ఎన్‌ఎల్ తొలగింపులు దాదాపు 18,000 నుండి 19,000 మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని తెలుస్తోంది.

దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, గ్రామాలలో 4జీ, 5జీ వంటి అధునాతన నెట్‌వర్క్ టెక్నాలజీలను ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ ఖర్చులను తగ్గించుకోవడంపైనా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగుల కొత్త స్వచ్ఛంద పదవీ విరమణ ప్రణాళిక (VRS)ను ప్రతిపాదించింది ఖర్చులను తగ్గించుకోవడానికి శ్రామిక శక్తి తగ్గింపు కోసం టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) ఆమోదాన్ని కోరింది. వీఆర్‌ఎస్‌ 2.0 కోసం రూ.1,500 కోట్లను ఆమోదించాలని కోరింది.

తాజా తొలగింపులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్‌పై ప్రభుత్వ ఖర్చులో 38% వరకు తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియలో బ్యాలెన్స్ షీట్ ఆరోగ్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ శ్రామిక శక్తిని నిర్వహణ కోసం సుమారు రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ ప్రతిపాదన కంపెనీ సంవత్సరానికి రూ.5,000 కోట్ల వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ లేఆఫ్‌ అభ్యర్థనకు కేబినెట్, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి అనుమతి రావాల్సి ఉంది.

2024 ఆర్థిక సంవత్సరంలో బీఎస్‌ఎస్‌ఎల్‌ ఆదాయం రూ.21,302 కోట్లుగా ఉంది. గత సంవత్సరం రూ.20,699 కోట్లతో పోలిస్తే ఇది కాస్త మెరుగు. ప్రస్తుతం సంస్థలో మొత్తం 55,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 25,000 మంది ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగులు కాగా 30,000 మంది నాన్ ఎగ్జిక్యూటివ్‌లు. 2019లో భారత ప్రభుత్వం బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ (MTNL) ఉద్యోగుల కోసం రూ.69,000 కోట్ల పునరుద్ధరణ ప్రణాళికను ఆమోదించింది.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)