Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ 5జీ నెట్‌వర్క్‌ సేవలకు డేట్‌ ఫిక్స్‌

Published on Tue, 10/15/2024 - 09:10

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన​్‌ఎల్‌ వచ్చే ఏడాది జూన్‌ నాటికి 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మే నాటికి లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరిస్తామన్నారు. ‘యూఎస్-ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరమ్‌’ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘4జీ టెక్నాలజీకి సంబంధించి భారతదేశం ప్రపంచాన్ని అనుసరించింది. ప్రపంచంతో కలిసి 5జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. కానీ 6జీ టెక్నాలజీలో మాత్రం ఇండియా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది మే నాటికి ఒక లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరించనున్నాం. జూన్‌ నాటికి 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇప్పటివరకు 38,300 సైట్‌లను ఎంపిక చేశాం. ప్రభుత్వ సంస్థ ప్రైవేట్‌ కంపెనీలకు చెందిన కీలక పరికరాలను ఉపయోగించబోదు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీఎస్‌ఎన​్‌ఎల్‌ వద్ద పూర్తిస్థాయిలో పనిచేసే రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌ ఉంది. పదేళ్ల క్రితం వాయిస్ కాల్ ఖరీదు 50 పైసలు. కానీ దాని విలువ మూడు పైసలకు చేరింది. వాయిస్ ధర 96 శాతం తగ్గింది. గతంలో ఒక జీబీ డేటా ధర రూ.289.10గా ఉండేది. దాని విలువా గణనీయంగా పడిపోయింది. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.

ఇదీ చదవండి: రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు

‘బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీ-డాట్‌, దేశీయ ఐటీ కంపెనీ టీసీఎస్‌ కన్సార్టియం అభివృద్ధి చేసిన 4జీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. పదేళ్ల క్రితం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ల సంఖ్య ఆరు కోట్లుగా ఉంది. ప్రస్తుతం అది 94 కోట్లకు పెరిగింది. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మెరుగవుతున్నాయి. ఈమేరకు చాలా రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. అమెరికాలో రక్షణ రంగానికి అవసరమయ్యే చిప్‌లను సరఫరా చేసే ఫ్యాబ్ (చిప్ ప్లాంట్)ను భారత్‌లో ఏర్పాటు చేయబోతున్నాం’ అని మంత్రి తెలిపారు.
 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)