Breaking News

బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘స్వదేశీ’ 4జీ నెట్‌వర్క్‌

Published on Sat, 09/27/2025 - 08:23

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు (శనివారం) ప్రారంభించనున్నారు. దీనితో టెలికం పరికరాలను పూర్తిగా దేశీయంగానే ఉత్పత్తి చేసుకుంటున్న చైనా, డెన్మార్క్, స్వీడన్, దక్షిణ కొరియా సరసన అయిదో దేశంగా భారత్‌ కూడా చేరనుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌కి చెందిన 97,500 మొబైల్‌ 4జీ టవర్లను ఒరిస్సాలోని ఝర్సుగూడలో ప్రధాని ప్రారంభిస్తారని, ఇది భారతీయ టెలికం రంగానికి ఒక కొత్త శకంలాంటిదని కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇందులో 92,600 మొబైల్‌ సైట్లు పూర్తిగా స్వదేశీ 4జీ టెక్నాలజీతో రూపొందినవని, వీటిని 5జీకి అప్‌గ్రేడ్‌ చేయొచ్చని ఆయన పేర్కొన్నారు.

కోర్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ను సీ–డాట్, రేడియో యాక్సెస్‌ నెట్‌వర్క్‌ (ర్యాన్‌) సిస్టమ్‌ను తేజస్‌ నెట్‌వర్క్‌ రూపొందించగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వీటిని అనుసంధానం చేసింది. మరోవైపు, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్, భారతీ ఎయిర్‌టెల్‌ కలిసి 4,700 మొబైల్‌ 4జీ టవర్లను ఇన్‌స్టాల్‌ చేశాయి. ఈ టవర్లతో మారుమూల, సరిహద్దు ప్రాంతాల్లోని 26,700 గ్రామాలకు కవరేజీ లభిస్తుంది. తద్వారా ఇరవై లక్షల మంది పైగా సబ్‌స్క్రైబర్స్‌కు సర్వీసులు అందుతాయి.

ఇదీ చదవండి: డబ్బు అడగొద్దు.. సలహా అడగండి!

#

Tags : 1

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)