Breaking News

నిమిషాల్లో కొత్త గ్యాస్‌ కనెక్షన్‌.. ఎక్స్‌ప్రెస్‌ డెలివరీ

Published on Sun, 07/19/2026 - 07:46

ప్రభుత్వ రంగ ఇంధన సంస్థ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) గృహ వినియోగదారులకు మరింత వేగవంతమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ‘భారత్‌గ్యాస్‌ లైట్‌ జిప్‌ (Bharat gas Lite ZIP)’ పేరుతో కొత్త ప్రీమియం ఎల్పీజీ సేవను ప్రారంభించింది. సంస్థ ఛైర్మన్‌ & మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ ఖన్నా, డైరెక్టర్‌ (మార్కెటింగ్‌) శుభాంకర్‌ సేన్‌ సమక్షంలో ఈ సేవను ప్రారంభించారు.

ఈ సర్వీస్‌లో ప్రధాన ఆకర్షణ ఎక్స్‌ప్రెస్‌ డెలివరీతో తక్షణ కొత్త ఎల్పీజీ కనెక్షన్‌ అందుబాటులో ఉండటమే. ఇది బీపీసీఎల్‌ ఇటీవల ప్రవేశపెట్టిన భారత్‌గ్యాస్‌ లైట్‌ కాంపోజిట్‌ సిలిండర్‌ ఆధారంగా రూపొందించబడింది. సాధారణ స్టీల్‌ సిలిండర్లతో పోలిస్తే ఈ కాంపోజిట్‌ సిలిండర్‌ 50 శాతానికి పైగా తేలికగా ఉండటంతో ఎత్తడం, తరలించడం సులభం. తుప్పు పట్టని బాడీ, సిలిండర్‌లో మిగిలిన గ్యాస్‌ పరిమాణాన్ని బయట నుంచే చూసే వీలు, అధునాతన భద్రతా ప్రమాణాలు, ఆధునిక డిజైన్‌ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.

నేటి వేగవంతమైన జీవనశైలికి అనుగుణంగా వినియోగదారులకు అవాంతరాలు లేని ప్రీమియం ఎల్పీజీ అనుభవం అందించడమే ‘లైట్‌ జిప్‌’ లక్ష్యమని బీపీసీఎల్‌ తెలిపింది. కొత్త కనెక్షన్‌ కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి, సేవలను మరింత స్మార్ట్‌గా అందించే దిశగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొంది.

ప్రస్తుతం ఈ సర్వీస్‌ను ముంబైలో ప్రారంభించగా, వచ్చే ఆగస్టు 15 నాటికి 24 రాష్ట్రాల్లోని మరో 100 నగరాలకు విస్తరించనున్నట్లు బీపీసీఎల్‌ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా మరిన్ని కుటుంబాలకు తేలికపాటి కాంపోజిట్‌ సిలిండర్లు, వేగవంతమైన కనెక్షన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)