Breaking News

వచ్చేస్తున్నాయ్‌ 10 కిలోల గ్యాస్‌ సిలిండర్లు..

Published on Thu, 07/23/2026 - 15:31

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) 10 కిలోల ఎల్పీజీ సిలిండర్ల లభ్యతను మరింత విస్తరించనుంది. ఆగస్టు 15 నాటికి దేశంలోని 24 రాష్ట్రాల్లో మరో 100 నగరాలకు ఈ సేవను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ వెల్లడించింది. చిన్న కుటుంబాలు, ఒంటరిగా నివసించే ఉద్యోగులు, విద్యార్థులు, తరచూ నివాసం మారే వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ముడి చమురు కొనుగోళ్లలో కూడా బీపీసీఎల్ వైవిధ్యాన్ని పెంచుతోంది. జూన్ త్రైమాసికంలో వెనిజులా, అంగోలా నుంచి దిగుమతులను పెంచగా, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మొత్తం ముడి చమురు కొనుగోళ్లలో రష్యా వాటా 38 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో స్పాట్ కార్గోల ద్వారా కొనుగోళ్లు గత ఏడాది ఇదే కాలంలోని 44 శాతం నుంచి 69 శాతానికి పెరిగినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం కంపెనీ వద్ద 3.8 మిలియన్ టన్నుల ముడి చమురు నిల్వలు ఉండగా, ఇవి సుమారు 35 రోజుల అవసరాలకు సరిపోతాయని వెల్లడించింది. అలాగే మొజాంబిక్ ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టు కార్యకలాపాలు 2029 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమవుతాయని అంచనా వేసింది.

ఇదిలా ఉండగా, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బీపీసీఎల్ రూ.3,962 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు త్రైమాసికంలో రూ.3,919 కోట్ల లాభం వచ్చినప్పటికీ, పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండటం, ఎల్పీజీ విక్రయాల్లో అండర్‌రికవరీలు పెరగడం వల్ల మార్జిన్లపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ఈ నష్టం మార్కెట్ అంచనా అయిన రూ.12,632 కోట్ల కంటే చాలా తక్కువగా నమోదవడం విశేషం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)