సోషల్ మీడియాలో కోర్టు పత్రాలు పోస్ట్ చేయడంపై ఆగ్రహం

Published on Wed, 09/23/2026 - 14:37

విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన అఫిడవిట్లు, కోర్టు పత్రాలను సోషల్ మీడియా వేదికలపై ప్రదర్శించడం పట్ల బాంబే హైకోర్టు విజయ్ మాల్యాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలోని అంశాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడం న్యాయస్థానాల సమర్థతను, స్వతంత్రతను దిగజార్చేలా ఉందనడంలో సందేహం లేదని ధర్మాసనం హెచ్చరించింది.

జస్టిస్ మిలింద్ జాధవ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు మాల్యా తరఫు సీనియర్ అడ్వకేట్ అమిత్ దేశాయ్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) దాఖలు చేసిన అఫిడవిట్ సెప్టెంబర్ 9న విచారణకు రావాల్సి ఉండగా అధికారికంగా కోర్టుకు సమర్పించడానికి ముందే (సెప్టెంబర్ 8 నాటి రాత్రి) మాల్యా దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసినట్లు ఈడీ న్యాయవాది ఆశిష్ మెహతా ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

దీనిపై స్పందించిన న్యాయమూర్తి, ‘ఇది ఏమాత్రం సరైన ప్రవర్తన కాదు. విషయం చాలా తీవ్రమైనది. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా క్లయింట్‌ను హెచ్చరించండి. ఏవైనా వాదనలు లేదా నివేదికలు ఉంటే నేరుగా కోర్టుకే సమర్పించాలి తప్ప సోషల్ మీడియాలో కాదు’ అని స్పష్టం చేశారు.

కేసు నేపథ్యం

భారత బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9,000 కోట్లకు పైగా రుణాలను ఎగవేసి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ద్వారా నిధుల మళ్లింపు (మనీ లాండరింగ్)కు పాల్పడ్డారనే ఆరోపణలను మాల్యా ఎదుర్కొంటున్నారు. రూ.14,131.6 కోట్ల విలువైన ఆస్తులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల సమాఖ్యకు కన్సార్టియం ద్వారా అప్పగించినందున తనపై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టివేయాలని కోరుతూ మాల్యా 2020లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, బ్యాంకుల రికవరీ చర్యల వల్ల క్రిమినల్ తీవ్రత తగ్గిపోదని, మనీ లాండరింగ్ నేరం చెల్లదని ఈడీ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. తదుపరి విచారణలో ఎస్‌బీఐ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.

ఇదీ చదవండి: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎంతంటే..

Videos

Watch Live: బాలాపూర్ లడ్డూ వేలం ప్రత్యక్షప్రసారం

నేను పోవాలని కొందరు... నన్ను కొన్నాళ్ళు బ్రతకనివ్వండి

DGPకి మెసేజ్ చేస్తే ఆయన ఇచ్చిన రిప్లై... సాయి కృష్ణ కేసులో అడ్వకేట్ సౌమ్య షాకింగ్ నిజాలు

మా అక్కకి చెప్పునా.. పిరికి పందలరా.. భయపడడం YSRCP బ్లడ్ లోనే లేదు

ఓరి మీ దుంప తెగ.. ఏ కేసులు పడితే ఆ కేసులు పెట్టమకండయ్యా స్వామి...

రెండు రోజులు అయింది దస్తగిరి మిమ్మల్ని కలిసి... ఎందుకో చెప్పమంటారా

కాకుమానుది మరణం కాదు.. ప్రభుత్వ హత్య.. కింద పడేసి తొక్కిన పోలీసులు.. సంచలన వీడియో

రూ 450 నుంచి లక్షల వేలం వరకు.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే..!

Watch Live: ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రత్యక్షప్రసారం

సాయికృష్ణకు మాత్రమే తెలిసిన ఒక రహస్యం బయటపడకూడదనే బూడిద చేశారు

Photos

+5

‘ది ప్యారడైజ్’ మూవీ ట్రెండింగ్ లో హీరోయిన్‌ కయాదు లోహర్ (ఫొటోలు)

+5

ఫరియా అబ్దుల్లా ‘సిగ్మా’ సినిమా (ఫొటోలు)

+5

వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్రకు సర్వం సిద్ధం (ఫొటోలు)

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)