Breaking News

లగ్జరీ ఎస్‌యూవీ బీఎండబ్ల్యూ ఎక్స్‌ఎం వచ్చేసింది..ధర తెలిస్తే!

Published on Sat, 12/10/2022 - 16:34

సాక్షి, ముంబై: జర్మన్‌కు చెందిన లగ్జరీకారు మేకర్‌ బీఎండబ్ల్యూ మరో హైబ్రిడ్‌ కారును భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం పేరుతో ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీని తీసుకొచ్చింది.  భారతదేశంలో దీని ధరను   రూ. 2.60 కోట్ల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. (ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్‌ కూడా..వేలాదిమందికి)

బవేరియన్ కార్‌మేకర్  ఎం బ్రాండ్‌ నుంచి వచ్చిన రెండో  లగ్జరీ కారుగాను,   ఎం బ్యాడ్జ్‌తో వచ్చిన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఎక్స్‌ఎం ప్లగ్-ఇన్హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అమెరికాలోని స్పార్టాన్స్‌బర్గ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. 


బీఎండబ్ల్యూ ఎక్స్​ఎం ఇంజీన్, ఫీచర్లు
ఇందులో అమర్చిన ట్విన్​-టర్బోఛార్జ్​డ్​ 4.4లీటర్​ పెట్రోల్​ ఇంజీన్‌ 653బీహెచచ్‌పీ పవర్‌ను, 800ఎన్​ఎం పీక్​ టార్క్​ ను ఉత్పత్తి చేస్తుంది.  లగ్జరీ ఎస్‌యూవీ కేవలం  4.3 సెకన్లలోనే 0-100  కి.మీ  వేగాన్ని అందుకోగలదు.  అలాగే EV మోడ్‌లో  గంటకు 140 కిమీ వేగంతో 88 కిమీ వరకు  దూసుకెళుతుందని కంపెనీ పేర్కొంది.

ఈ మాసివ్‌  ఎస్‌యూవీలోని  కిడ్నీ షేప్డ్‌  ఫ్రంట్ గ్రిల్ ,  LED స్పిట్ హెడ్‌లైట్‌లు, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్  ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంకా 23-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-టిప్ ఎగ్జాస్ట్ ద్వారా డిజైన్‌ను ఆకర్షణీయంగా మార్చింది.రియర్‌లో  వర్టికల్లీ స్టాకెడ్​ ఎక్సాస్ట్​ ఔట్​లెట్స్​,అడాప్టివ్​ ఎం సస్పెన్షన్​, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్​ డ్యాంపర్స్​, కొత్త 48వీ సిస్టెమ్​ ఉన్నాయి.

ఇక ఇంటీరియర్‌గా హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), 15,000 వాట్ బోవర్స్ అండ్‌ విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌,  12.3 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 14.9 ఇంచెస్‌  టచ్‌స్క్రీన్, ఐడ్రైవ్​ 8 సాప్ట్‌వేర్‌, ఏడీఏఎస్​ టెక్​,  యాంబియంట్​ లైటింగ్​, 4 జోన్​ ఆటోమెటిక్​ కంట్రోల్​ లాంటి ఇతర  ఫీచర్లున్నాయి.

దీంతోపాటు బీఎండబ్ల్యూ  ఎక్స్‌ 7 ఫేస్‌ లిఫ్ట్‌,  బీఎండబ్ల్యూ ఎం 340ఐ ఎక్స్‌ డ్రైవ్‌ని కూడా  లాంచ్‌ చేసింది. తద్వారా  దేశంలో  తన ఉత్పత్తి శ్రేణిని  మరింత విస్తరిస్తోంది. BMW M340i xDrive ధర రూ. 69.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)