Breaking News

టెస్లా కార్ల డిజైన్‌లను తలదన్నేలా.. బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్‌ కార్‌ ఎలా ఉందో చూశారా?

Published on Sun, 09/03/2023 - 14:51

ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..టెస్లాకు గట్టిపోటీ ఇవ్వనుంది. ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లో నెంబర్‌ వన్ స్థానంలో కొనసాగుతున్న టెస్లాను తలదన్నేలా ఇప్పటి వరకు ఏ కార్లలో లేని డిజైన్లతో ప్రత్యేకమైన తొలి ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ప్రోటో టైప్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా, చైనా ఎలక్ట్రిక్‌ మార్కెట్‌లో తొలిస్థానంలో ఉన్న టెస్లా, ఇతర స్థానిక ఆటోమొబైల్‌ కంపెనీలను వెనక్కి నెట్టి, వాహనదారుల్ని ఆకట్టుకునేలా ఈ కారును డిజైన్‌ చేసింది. 

‘బీఎండబ్ల్యూ న్యూ క్లాస్సే’ (bmw Neue Klasse) పేరుతో విడుదల కానున్న బీఎండబ్ల్యూ కారును వచ్చే వారం జర్మనీ మ్యూనిచ్‌లో జరిగే ఇంటర్నేషన్‌ మోటార్స్‌ షో (iss) ప్రదర్శనకు పెట్టనుంది. 2025లో ఈ మార్కెట్‌లోకి విడుదల చేయనుంది.

అదే సమయంలో మెర్సిడెజ్‌ బెంజ్‌ గ్రూప్‌ సైతం న్యూ బ్యాటరీ పవర్డ్‌ మోడల్స్‌తో పాటు, వోక్స్‌వ్యాగన్ కార్‌ విడుదల కావాల్సి ఉంది. కానీ కార్లలో తలెత్తిన సాఫ్ట్‌వేర్‌ సమస్యల కారణంగా ఫోర్ష్‌, ఆడి కార్ల విడుదల కంటే ఆలస్యంగా మార్కెట్‌కు పరిచయం కానున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  

డిజైన్‌లు, ఫీచర్లు అదరగొట్టేస్తున్నాయ్‌
దశబ్ధాల కాలంగా రెండు డోర్లతో విడుదల చేసే కూపే (cupe) తరహా కార్లకు బీఎండబ్ల్యూ స్వస్తి చెప్పింది. బదులుగా, విండ్‌స్క్రీన్ మొత్తం వెడల్పు చేసింది. దీంతో పాటు వాయిస్ కమాండ్‌లు, హ్యాండ్‌ మూమెంట్‌తో డ్రైవింగ్‌ చేసేలా డిజిటల్ డిస్‌ప్లేను డిజైన్‌ చేసింది. చైనా కంపెనీలైన బీవైడీ కో, ఎన్‌ఐఓ ఐఎన్‌సీకి పోటీగా స్థానిక వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా అదిరిపోయే ఫీచర్లతో ఈవీ కారును రూపొందిస్తుంది.  


bmw Neue Klasse రేంజ్‌ ఎంతంటే
బీఎండబ్ల్యూ న్యూ క్లాస్సే మోడల్‌లు 800 కిలోమీటర్ల (497 మైళ్ళు) పరిధిని కలిగి ఉంటాయి. అరగంటలో 10శాతం నుండి 80శాతం వరకు ఛార్జ్ అవుతుంది. గత సంవత్సరం, మెర్సిడెస్ నుండి ఎలక్ట్రిక్ ప్రోటోటైప్ ఒకే ఛార్జ్‌తో 1,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచింది. కాగా, బీఎండబ్ల్యూ, మెర్సిడైజ్‌ బెంజ్‌, ఆడి కార్లు చైనా ప్రీమియం సెగ్మెంట్లలో ఆదిపత్యాన్ని చెలాయించాయి. కానీ అక్కడ ఈవీ కార్లకు డిమాండ్‌ పెరడగడంతో ఫ్యూయిల్‌ కార్ల అమ్మకాలు తగ్గిపోయాయి. అందుకే ఆటోమొబైల్‌ సంస్థ ఎలక్ట్రిక్‌ కార్లపై దృష్టిసారించాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)