Breaking News

ఈ హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ టార్గెట్‌ రూ.3 వేల కోట్లు

Published on Sun, 06/21/2026 - 12:55

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,000 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌ సీఈవో చంద్రశేఖర్‌ ముద్రగణం వెల్లడించారు. ఇతర సంస్థల కొనుగోళ్లు, వ్యాపార విస్తరణ ఇందుకు దోహదపడనున్నట్లు ఆయన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 26 శాతం వృద్ధి చెంది రూ. 1,002 కోట్లుగా నమోదైంది.

ఒరిస్సాలో 100 మెగావాట్ల డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనిపై మూడు దశల్లో 350 మిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు. ఏఐ ఆధారిత యాక్సెస్‌జినీ ప్లాట్‌ఫాం, బ్లూహెల్త్, బ్లూబయో మొదలైన వాటిపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు చంద్రశేఖర్‌ తెలిపారు. క్యాన్సర్‌ సంబంధ పరిశోధనలకు తోడ్పడేలా దాదాపు రూ. 400 కోట్లతో గుంటూరులో బయోబ్యాంక్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

ఆఫ్రికాలోని వర్ధమాన దేశాల్లో విస్తరణపై ఫోకస్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వివిధ ఉత్పత్తుల కోసం నాలుగు దేశాలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 450 మంది ఉద్యోగులు ఉండగా, 2030 నాటికి ఈ సంఖ్యను 2,000కు పెంచుకోనున్నట్లు చంద్రశేఖర్‌ తెలిపారు. అప్పటికల్లా బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)