Breaking News

Jayanti Chauhan: వేల కోట్ల కంపెనీకి లేడీ బాస్.. జయంతి చౌహాన్

Published on Tue, 03/21/2023 - 10:54

గత కొన్ని రోజులుగా ప్యాకేజ్‌డ్‌ వాటర్‌ బిజినెస్‌ కంపెనీ బిస్లెరీ ఇంటర్నేషనల్‌ను విక్రయించాలని సన్నాహాలు జరిగాయి. అయితే వాటన్నంటికీ ఇప్పుడు తెరవేసారు. కంపెనీని ప్రస్తుతం ఎట్టిపరిస్థితుల్లో విక్రయించబోమని రమేష్‌ చౌహాన్‌ స్పష్టం చేశారు.

నిజానికి బిస్లెరీ విక్రయానికి సంబంధించి చర్చలు టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ లిమిటెడ్‌తో గడిచిన నాలుగు నెలలుగా జరుగుతున్నాయి. అయితే ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. బిస్లరీ బ్రాండ్‌ను టాటా గ్రూప్‌కు రూ.7,000 కోట్లకు విక్రయించాలని గతంలో అనుకున్నప్పటికీ, చివరికి రద్దయింది.

 

జయంతి చౌహాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జార్జ్ నేతృత్వంలోని ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్ బృందంతో కలిసి పని చేసింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే బిస్లరీ ఇంటర్నేషనల్ ఛైర్మన్ 'రమేష్ చౌహాన్' కూతురే 'జయంతి చౌహాన్'. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (TCPL)తో చర్చలు ముగిసిన తరువాత ఈమె సంస్థకు సారథ్యం వహించే బాధ్యతలు స్వీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని రమేష్ చౌహాన్ స్వయంగా మీడియాకు తెలిపారు.

(ఇదీ చదవండి: EPFO: పీఎఫ్‌ విత్‌ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు..)

జయంతి చౌహాన్ లాస్ ఏంజిల్స్‌లోని 'ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అండ్ మర్చండైజింగ్' (FIDM) లో ప్రాడక్ట్  డేవలప్మెంట్, లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ నుండి ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీ చదివింది. అంతే కాకుండా స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి అరబిక్ కూడా నేర్చుకున్నారు.

(ఇదీ చదవండి: 2023 ఇన్నోవా క్రిస్టా లాంచ్ చేసిన టయోట - పూర్తి వివరాలు)

జయంతి ప్రారంభంలో బిస్లరీ ప్లాంట్ ప్రాసెస్ ఆటోమేషన్‌పై ద్రుష్టి సారించి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్‌తో పాటు సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చింది. ఆ తరువాత 2011లో ఢిల్లీ నుంచి ముంబైకి షిఫ్ట్ అయిన తరువాత హిమాలయాస్ నేచురల్ మినరల్ వాటర్, బిస్లరీ హ్యాండ్ ప్యూరిఫైర్స్ వంటి కొత్త బ్రాండ్‌లను నడపడంలో ఆమె కీలక పాత్ర పోషించారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)