Breaking News

పూనవల్లా గ్యారేజిలో అపురూపమైన కారు

Published on Tue, 10/28/2025 - 13:30

చాలామంది వాహన ప్రేమికులు.. నచ్చిన కార్లను ఎప్పటికప్పుడు తమ గ్యారేజిలో చేరుస్తూ ఉంటారు. ఇందులో కొత్త కార్లు మాత్రమే కాకుండా.. వింటేజ్ కార్లు కూడా ఉంటాయి. అత్యంత ఖరీదైన, అపురూపమైన కార్లను కలిగిన ప్రముఖుల జాబితాలో యోహాన్ పూనవల్లా కూడా ఉన్నారు. తాజాగా ఈయన కార్ గ్యారేజిలో 'టయోటా సుప్రా MKIV' చేరింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా ఖాతాలో వైరల్ అవుతున్నాయి.

యోహాన్ పూనవల్లా కుమారుడు.. 'జయన్ పూనవల్లా' టయోటా సుప్రా MKIV పక్కన ఉన్న ఫోటోలను మిథున్ వెట్టత్ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ కారును జయన్ డ్రైవ్ చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్ని ఫోటోలలో ఈ కారు గ్యారేజిలో రోల్స్ రాయిస్‌, బెంట్లీ, జాగ్వార్ వంటి కార్ల పక్కన పార్క్ చేసి ఉండటం చూడవచ్చు.

టయోటా సుప్రా MKIV
టయోటా సుప్రా MKIV అనేది 1990ల నాటి అత్యంత ప్రసిద్ధ చెందిన స్పోర్ట్స్ కార్లలో ఒకటి. ఆటోమోటివ్ ఔత్సాహికులలో దీనికి మంచి డిమాండ్ ఉంది. ఇది మంచి పనితీరును అందించే కారు కావడంతో.. ఇప్పటికి కూడా ఈ కారుకు అభిమానులు చాలామందే ఉన్నారు. పూనవల్లా గ్యారేజిలో చేరిన ఈ కారును కొంత కష్టమైజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: పెయింట్ కోసమే రూ.13 లక్షలు.. ఈ బైక్ ధర ఎంతో తెలుసా?

యోహాన్ పూనవాలా కార్ల కలెక్షన్
యోహాన్ పూనవాలా గ్యారేజిలో.. భారతదేశంలో అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII EWBతో పాటు మొత్తం 22 రోల్స్ రాయిస్ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా క్వీన్ ఎలిజబెత్ II ఉపయోగించిన రేంజ్ రోవర్ కూడా వీరి గ్యారేజిలో ఉంది. 2016లో యునైటెడ్ కింగ్‌డమ్ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా & అతని భార్య కోసం అదే రేంజ్ రోవర్‌ను ఉపయోగించారు. సరికొత్త ఫ్లయింగ్ స్పర్, పాత ఫ్లయింగ్ స్పర్, అనేక వింటేజ్ బెంట్లీలతో సహా అనేక బెంట్లీ కార్లు వీరి వద్ద ఉన్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)