Breaking News

తలపాగా రంగుకో రోల్స్ రాయిస్ కారు: ఎవరీ రూబెన్ సింగ్!

Published on Tue, 02/24/2026 - 21:07

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో రోల్స్ రాయిస్ ఒకటి. చాలామంది వాహన ప్రియులకు ఈ కార్లలో ఒక్కసారైనా తిరగాలని ఉంటుంది. కానీ వీటి ధర కోట్ల రూపాయల్లో ఉండటం వల్ల ఇది సాధ్యం కాదు. ధనవంతులు సైతం రోల్స్ రాయిస్ కారు కొనాలంటే ఒక నిమిషం ఆలోచిస్తారు. అలాంటిది ఒక వ్యక్తి 15 కంటే ఎక్కువ రోల్స్ రాయిస్ కార్లు కొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

భారత సంతతికి చెందిన రూబెన్ సింగ్ (Reuben Singh) యూకేకు చెందిన వ్యాపారవేత్త, ఇషర్ క్యాపిటల్ సీఈఓ. తలపాగా ధరించడం వల్ల ఈయన ఒకప్పుడు జాతి వివక్షను, ఆంగ్లేయుల నుంచి అవమానాలను ఎదుర్కున్నారు. సిక్కులు పవిత్రంగా చూసే తలపాగాను అవమానించడంతో.. సింగ్ తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు.

టర్బన్ ఛాలెంజ్ పేరుతో ప్రతి వారం ఆయన ధరించిన తలపాగా రంగుకు తగిన రోల్స్ రాయిస్ కారును కొనుగోలు చేసి.. దానితో ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడం ప్రారంభించారు. ఇలా మొత్తం 15 రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేశారు. దీంతో ఆయనను అవమానించినవారే అవాక్కయ్యారు.

ఇదీ చదవండి: 25 ఏళ్లకే మిలియనీర్‌ను చేసిన కియోసాకి బుక్

రోల్స్ రాయిస్ కార్లు మాత్రమే కాకుండా.. ఈయన వద్ద పోర్స్చే 918 స్పైడర్, బుగట్టి వెయ్రాన్, పగని హుయారా, లంబోర్గిని హురాకాన్, లిమిటెడ్ ఎడిషన్ ఫెరారీ F12 బెర్లినెట్టా కార్లను కూడా కలిగి ఉన్నారు.

ఎవరీ రూబెన్ సింగ్?
బ్రిటన్ బిల్ గేట్స్‌గా ప్రపంచానికి సుపరిచితమైన రూబెన్ సింగ్ భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రూబెన్ సింగ్. తల్లితండ్రుల మీద ఆధారపడ కుండా తన సొంత తెలివితేటలతో ఎంతో శ్రమించి భారీగా డబ్బు సంపాదించాడు. 1990లో ఇంగ్లాండులో మిస్ ఆటిట్యూడ్ అనే ఫ్యాషన్ చైనా బిజినెస్ స్థాపించి కోట్లు సంపాదించగలిగాడు. 17వ ఏట నుంచి రోజుకి 20 గంటలు కస్టపడి గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ఆ తరువాత కొన్ని రోజులకు తన సంస్థ కొంత వెనుకపడింది. అయినప్పటికీ పట్టు వదలకుండా శ్రమించి లాభాల బాటలో పయనించేలా చేసాడు.

Videos

బంగారం, వెండి కొనాలనుకునేవారికి షాక్.. ఇవాళ ధరలు ఎలా ఉన్నాయంటే..!

నందమూరి బాలయ్య కోసం నారా బావయ్య నిర్వాకం

ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్.. కోడింగ్ రాసేది, ఎగ్జిక్యూట్ చేసేది అంతా AI

ఇజ్రాయెల్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

నయా ట్రెండ్.. పెళ్లికి ముందు అంతా చేసేసి బ్లాక్ మెయిల్

భారత్ సెమీస్ చేరాలంటే..? 11 ఓవర్లలో ఎంత ఛేజ్ చేయాలంటే..!

సుబ్బారెడ్డి భార్యను మేం తీసుకొస్తాం చంద్రబాబు, లోకేష్, బిఆర్ నాయుడు.. మీ భార్యలను తీసుకురండి

కూటమి సర్కార్ కు షాకిచ్చిన సోము వీర్రాజు

యూట్యూబర్‌ అన్వేష్‌పై లుకౌట్ నోటీసులు

Amalapuram: రెస్టారెంట్లో అమలాపురం కుళ్ళిన చికెన్‌తో బిర్యానీ

Photos

+5

విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి విశేషాలు (ఫొటోలు)

+5

కుంభాభిషేక మహోత్సవంలో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

బ్లాక్ అండ్ బ్లాక్‌లో మెరిసిపోతున్న శిరీష్-నయనిక (ఫొటోలు)

+5

నందిపల్లిలో వైఎస్‌ జగన్‌ పర్యటనతో పండుగ వాతావరణం (ఫొటోలు)

+5

Telangana Inter Exams : ఇంటర్ పరీక్షలు ప్రారంభం (ఫొటోలు)

+5

శ్రీదేవి 'బ్యాండ్ మేళం' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

బీచ్ ఒడ్డున అలా సరదాగా సింగర్ సునీత (ఫొటోలు)

+5

నాని స్టైల్లోనే అతడికి బర్త్‌డే విషెస్ చెప్పిన అక్క (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ఒకప్పటి హీరోయిన్ (ఫొటోలు)