పెరుగు అమ్ముతూ లక్షలు గడిస్తున్న బీహార్ వ్యక్తి - ఎలాగో తెలిస్తే..

Published on Tue, 08/22/2023 - 13:48

మనిషి జీవితంలో పెరుగు అనేది ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో ఒక భాగమైపోయింది. దాదాపు పెరుగంటే ఇష్టం లేని వారు ఉండరు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడమే కాకుండా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ కారణంగానే ఎక్కువమంది పెరుగును తెగ ఇష్టపడిపోతుంటారు. బీహార్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పెరుగు అమ్ముతూ రూ. 10 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నిజానికి ఇప్పుడు ప్యాకెట్లలో లభించే పెరుగుని ఎక్కువ వినియోగిస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా బీహార్‌లోని ఖగారియాకు చెందిన 'చంద్రభూషణ్ కుమార్' అనే వ్యక్తి 'మట్కా' పెరుగుతో లక్షలు సంపాదిస్తున్నాడు. 2018 ప్రారంభించిన ఈయన వ్యాపారం అంతంత మాత్రంగానే ఉండేది.

కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కూలీలతో తిరిగి వ్యాపారం ప్రారంభించాడు. 'గావ్ సే' బ్రాండ్‌ను స్థాపించడానికి తన గ్రామం నుండి వలస వచ్చిన కార్మికులతో కలిసి పనిచేశాడు. ఆ తరువాత ఇది మంచి ప్రజాదరణ పొందగలిగింది.

ఇదీ చదవండి: మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా..

నిజానికి మట్కా పెరుగు ప్రత్యేకత ఏమిటంటే.. కుండను కిందికి బోర్లించినప్పటికీ పెరుగు కిందపడదు. అలాగే కుండకు అతుక్కుని ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఈ పెరుగు నాణ్యత ఎలా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. మార్కెట్లోని ఇతర బ్రాండెడ్ పెరుగులకంటే కూడా ఈ మట్కా పెరుగుకి డిమాండ్ చాలా ఎక్కువ. ప్రస్తుతం ఈ పెరుగు బీహార్ సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపారిస్తోంది.

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)