రూ. లక్ష ఖర్చుతో.. 5 సీటర్ ఎలక్ట్రిక్ కారు!

Published on Fri, 01/09/2026 - 20:45

కొంతమంది ఆటోమొబైల్ ఔత్సాహికులు అప్పుడప్పుడు.. కొన్ని అద్భుతాలను చేస్తుంటారు. ఇందులో భాగంగానే.. బీహార్‌కు చెందిన ఒక వ్యక్తి 18 రోజుల్లో ఐదు సీట్ల ఎలక్ట్రిక్ జీపును నిర్మించారు. అయితే ఆ వ్యక్తి దీనికోసం చేసిన ఖర్చు ఎంత?, ఇది ఒక ఫుల్ ఛార్జిపైన ఎన్ని కిమీ దూరం ప్రయాణిస్తుంది అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

బీహార్‌కు చెందిన ముర్షిద్ ఆలం ఒక చిన్న దుకాణం నడుపుతూ వాహనాలను మరమ్మతు చేసేవారు. తన గ్యారేజీలో పనిచేస్తున్నప్పుడు, గ్రామాల్లోని రైతులు & చిన్న వ్యాపార యజమానులకు రోజువారీ ప్రయాణానికి లేదా వ్యవసాయ పనులకు తక్కువ ధరలో, సమర్థవంతమైన రవాణా ఎంపిక లేకపోవడాన్ని గమనించారు. అయితే డీజిల్ & పెట్రోల్ వాహనాలు ఖరీదైనవి.. వాటి నిర్వహణ కోసం కొంత ఎక్కువ డబ్బు కేటాయించాల్సి వచ్చేది. ఎలక్ట్రిక్ వాహనాలు గ్రామీణ వినియోగదారులకు అందుబాటులో లేవు.

ఇవన్నీ గమనించిన ముర్షిద్.. గ్రామ అవసరాలకు అనుగుణంగా స్వదేశీ ఎలక్ట్రిక్ జీపును రూపొందించాలనుకున్నారు. దీంతో లక్ష రూపాయలు వెచ్చించి, కేవలం 18 రోజుల్లో ఎలక్ట్రిక్ జీపు సిద్ధం చేశారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. దీనిని స్థానికులు "దేశీ టెస్లా" అని పిలుచుకుంటున్నారు.

ఇదీ చదవండి: సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ధర ఎంతంటే?

ముర్షిద్ తయారు చేసిన ఎలక్ట్రిక్ జీపులో ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన నాలుగు చక్రాలు, స్పీడోమీటర్, పవర్ స్టీరింగ్ & ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి. పంటలు, ఎరువులు & ఇతర వస్తువులను తీసుకెళ్లడానికి ఒక ట్రాలీని కూడా జత చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఈ కారును పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు ఐదు గంటలు పడుతుంది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)