Breaking News

వెస్ట్‌ హైదరాబాద్‌ తప్ప అంతా ‘అందుబాటు’లోనే..

Published on Sat, 09/06/2025 - 15:31

గ్రేటర్‌లో సామాన్యుల సొంతింటి కల రోజురోజుకూ దూరమవుతున్న నేపథ్యంలో పలు నిర్మాణ సంస్థలు వాటిని చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. భూముల ధరలు పెరగడం, నిర్మాణ సామగ్రి, కార్మికుల వ్యయాల భారమవడం వంటి పలు కారణాలతో నగరంలో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా పలు నిర్మాణ సంస్థలు ఇప్పటికీ పశ్చిమ హైదరాబాద్‌ మినహా ఇతర ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతికి అందుబాటు ధరల్లో గృహాలను నిర్మిస్తున్నాయి. తక్కువ ధర అనో, ప్రీలాంచ్‌లోనో కొనుగోలు చేసి మోసపోకుండా.. కాస్త జాగ్రత్త వహిస్తే సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. -సాక్షి, సిటీబ్యూరో

రెండు బెడ్‌ రూములు, కిచెన్, హాల్, టాయిలెట్స్‌తో 700–800 చ.అ. విస్తీర్ణంలో ఉండే బడ్జెట్‌ హోమ్స్‌కు ఇప్పటికీ ఆదరణ ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నేపథ్యంలో హైదరాబాద్‌లో అఫర్డబుల్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌లకు గిరాకీ ఉంది. చిన్న వ్యాపారులు, సూపర్‌వైజర్లు, డ్రైవర్లు, మధ్యస్థాయి ఉద్యోగులు వంటి సామాన్య, మధ్య తరగతి వర్గాలు ఎక్కువగానే ఉన్నారు. వీరు తమ సొంతింటి కలను బడ్జెట్‌ హోమ్స్‌తో తీర్చుకుంటారు. అద్దెకు ఉండే బదులు అదే సొమ్మును నెలవారీ వాయిదా(ఈఐఎం) రూపంలో చెల్లిస్తే సొంతిల్లు సొంతమవుతుందనేది వారి కాన్సెప్ట్‌. దీంతో రూ.60 లక్షల లోపు ధర ఉండే అందుబాటు గృహాలకు డిమాండ్‌ పెరిగింది.

బిల్డర్లలో ధరల పోటీ.. 
2–3 ఏళ్ల క్రితం వరకు కూడా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే గృహాల ధరలు అందుబాటులో ఉండేవి. కానీ, హైరైజ్‌ అపార్ట్‌మెంట్లు, ఆధునిక వసతుల కల్పనలో బిల్డర్లు పోటీ పడుతుండటంతో రూ.కోట్లు వెచ్చిస్తేగానీ సొంతింటి కల సాకారం కాని పరిస్థితి. మాదాపూర్, నార్సింగి, నానక్‌రాంగూడ, కోకాపేట వంటి పశ్చిమ హైదరాబాద్‌ మినహా మిగిలిన మూడు జోన్లలో ఇప్పటికీ సామాన్యులకు రూ.60 లక్షల లోపు ధర ఉండే అఫర్డబుల్‌ గృహాలు దొరుకుతున్నాయి.

ఏ ప్రాంతాల్లో కొనొచ్చంటే.. 
ఇబ్రహీంపట్నం, నాగార్జున్‌సాగర్‌ రోడ్, హయత్‌నగర్, పోచారం, ఘట్‌కేసర్, కీసర, శామీర్‌పేట వంటి ప్రాంతాల్లో బడ్జెట్‌ హోమ్స్‌ కొనుగోలు చేయవచ్చు. ఔటర్‌ లోపల ఉండే నివాస ప్రాంతాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఎంపిక చేసుకోవడం ఉత్తమం. దీంతో ఇల్లు చిన్నగా అనిపించినా, చుట్టూ ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది.

కొనే ముందు వీటిని పరిశీలించాలి
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్‌ ఉన్న ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి. 
ప్రమోటర్లు, బిల్డర్ల పాత చరిత్ర చూడాలి. 
ప్రాజెక్ట్‌లను పూర్తి చేసే ఆర్థిక శక్తి నిర్మాణ సంస్థకు ఉందో లేదో పరిశీలించాలి. 
రోడ్డు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి మౌలిక వసతులు ఉన్న ప్రాంతాల్లో కొనుగోలు చేయడం ఉత్తమం. 
బడ్జెట్‌ హోమ్స్‌ ప్రాజెక్ట్‌లకు సమీపంలో విద్యాసంస్థలు, ఉపాధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంచుకోవడం బెటర్‌.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)