ఐపీఓ, ఈక్విటీ వైపు తెలుగు రాష్ట్రాల చూపు!

Published on Sat, 08/01/2026 - 14:44

దేశంలోనే సాహసోపేతమైన, చొరవగల వ్యాపార వర్గాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలయంగా ఉన్నాయి. వ్యవసాయం, సంప్రదాయ పరిశ్రమల నుంచి ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల వరకు ఈ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. అయితే, గత ఐదేళ్ల ఐపీఓ దరఖాస్తులపై జరిగిన విశ్లేషణను పరిశీలిస్తే.. తెలుగు వారి తదుపరి ఆర్థిక వృద్ధి ప్రయాణం స్టాక్ మార్కెట్లలోనే ఉండబోతోందని స్పష్టమవుతోంది.

ప్రైమరీ మార్కెట్‌లో భాగస్వామ్యం

దేశవ్యాప్తంగా 33 రాష్ట్రాలు, 785 పట్టణాల పరిధిలో నమోదైన 1.83 కోట్ల ఐపీఓ దరఖాస్తుదారులలో.. తెలంగాణ నుంచి 3.99 లక్షలు (2.17%), ఆంధ్రప్రదేశ్ నుంచి 4.41 లక్షలు (2.40%) నమోదయ్యాయి. మొత్తంగా 8.4 లక్షల మంది తెలుగు మదుపరులు ప్రైమరీ మార్కెట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ వంటి చారిత్రాత్మక మార్కెట్ లీడర్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈక్విటీ కల్చర్‌ మరింత ఎదగడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి.

తలసరి దరఖాస్తుదారులను చూస్తే.. జాతీయ సగటు 12,841 కాగా తెలంగాణలో ప్రతి పది లక్షల మందికి 10,490, ఆంధ్రప్రదేశ్‌లో 8,316 మంది ఉన్నారు. ఇది వీరి ఆకాంక్షలు తక్కువగా ఉన్నాయని చెప్పడానికి నిదర్శనం కాదు. తెలుగు కుటుంబాల పొదుపు క్రమశిక్షణ చాలా బలమైనది. ఇప్పటివరకు భూమి, బంగారం వంటి సంప్రదాయ ఆస్తులకే ప్రాధాన్యమిచ్చిన వీరు ఇకపై తమ పొదుపులో కొంత భాగాన్ని లిస్టెడ్ ఈక్విటీల వైపు మళ్లించేందుకు బలమైన అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మౌలిక వసతులు సిద్ధం.. అడ్డంకి లేని ప్రయాణం

మదుపు విస్తరణకు కావలసిన డిజిటల్ మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి 1.24 కోట్లు, తెలంగాణ నుంచి 61 లక్షల నమోదిత ట్రేడింగ్ ఖాతాలు ఉన్నాయి. ట్రేడింగ్ ఖాతాల లభ్యత సులువైనందున సాధారణ పొదుపుదారులను క్రియాశీల ఈక్విటీ మదుపరులుగా మార్చడం తదుపరి ప్రాథమిక లక్ష్యం కానుంది. రియల్ ఎస్టేట్, బంగారం స్థిరత్వాన్నిస్తాయి. బ్యాంక్ డిపాజిట్లు నమ్మకాన్నిస్తాయి. కానీ ఈక్విటీలు దీర్ఘకాలంలో దేశ వ్యాపార వృద్ధిలో ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని, అధిక రాబడిని అందిస్తాయి. సెబీ ప్రోత్సహిస్తున్న సమతుల్య విధానం కూడా ఇదే.

ఇదీ చదవండి: స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్ బ్యాన్!

Videos

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

ఊహించని ఊచకోత.. అప్పుడే రూ.100 కోట్లు

దానంకు ఖైరతాబాద్ టికెట్ టెన్షన్

కర్నూలులో పట్టపగలే చోరీ.. రైతు బైక్ నుంచి రూ.2 లక్షలు మాయం

చింతమనేని నీకే చెప్తున్నా దెందులూరు గడ్డ సాక్షిగా.. నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన హైదరాబాద్ లేడీ పోలీస్ డాన్స్

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

మధుబాబును సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాల ఆగ్రహం

ఉండ్రాజవరంలో హైటెన్షన్.. పోలీసులకు వంగవీటి కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో సమ్మక్క పాత్ర.. నటి జ్ఞాపకాలు (ఫొటోలు)