తస్మాత్‌ జాగ్రత్త! .. గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఫేక్ చాట్‌జీపీటీ యాప్స్ కలకలం

Published on Sat, 06/17/2023 - 19:51

టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది సైబర్‌ నేరస్తులు తెలివి మీరిపోతున్నారు. ఈజీ మనీ పేరుతో యూజర్ల జేబును ఖాళీ చేసేందుకు అదే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గత ఏడాది విడుదలైన చాట్‌జీపీటీ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఏఐ టూల్‌తో సైబర్‌ నేరస్తులు ఆండ్రాయిడ్‌ యూజర్ల ఫోన్‌లలో మాల్వేర్‌ను పంపిస్తున్నారు. బ్యాంకు అకౌంట్‌లో సొమ్ము కాజేస్తున్నారు. లేదంటే యూజర్ల డేటాను డార్క్‌ వెబ్‌లో సొమ్ము చేసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

పాలో ఆల్టో నెట్‌వర్క్స్ పరిశోధకులు చాట్‌జీపీటీ ఫేక్‌ యాప్స్‌లలో మీటర్‌ప్రెటర్ ట్రోజన్ అనే మాల్‌వేర్‌ను గుర్తించారు. ఈ మాల్వేర్ వేరియంట్‌లు ప్రత్యేకంగా చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్ ఉపయోగించడానికి ఆసక్తి ఉన్న యూజర్లను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు గుర్తించారు. కాబట్టి, ఏఐ యాప్స్‌ పట్ల వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

అదే సమయంలో సైబర్‌ నేరస్తులు ఫేక్‌ చాట్‌జీపీటీ యాప్స్‌ సాయంతో పెద్ద మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసిన కాంటాక్ట్‌ నెంబర్లకు మెసేజ్‌లు పంపుతున్నారు. ఆ మెసేజ్‌లను క్లిక్‌ చేయడం ద్వారా మాల్వేర్‌లు సదరు యూజర్ల ఫోన్‌లలోకి ఈజీగా చొరబడుతుంది. తద్వారా డబ్బుల కోసం అడ్డదార్లు తొక్కుతున్న కేటుగాళ్లు బాధితుల్ని బెదిరించి వారికి కావాల్సినంత డబ్బుల్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ తరహా ఫోన్‌ నెంబర్లనే మాల్వేర్ క్రియేటర్లు, స్కామ్‌లు, మోసపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఈ తరుణంలో గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న చాట్‌జీపీటీ ఫేక్‌ యాప్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ టెక్నాలజీ నిపుణులు యూజర్లను హెచ్చరిస్తున్నారు. డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో రివ్యూలతో పాటు గతంలో ఆ యాప్‌ను ఎంతమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారో గుర్తించాలని చెబుతున్నారు. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఫేక్‌ యాప్స్‌ జోలికి పోవద్దని సలహా ఇస్తున్నారు.

Videos

కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న టీడిపీ గూండాల దౌర్జన్యాలు

ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?

70 ఏళ్లపైనే ఉన్నావ్.. లుచ్చా పనులు ఆపేయ్! JCకి పెద్దారెడ్డి మాస్ వార్నింగ్

నా 25ఏళ్ల సన్నిహితంతో చెప్తున్న.. లోకేష్ వల్ల TDP భూస్థాపితం అవ్వడం తథ్యం

చూస్కుందాం...! నువ్వా... నేనా...

వృద్ధుడిని కూడా వదలరా? సొంత పార్టీ నేతలపై టీడీపీ గూండాల దాడులు

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

Photos

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)