Breaking News

బెస్ట్ సీఎన్‌జీ కార్లు: ధర రూ.10 లక్షల కంటే తక్కువే..

Published on Sat, 03/08/2025 - 17:14

పెట్రోల్ ధరలు పెరగడం, సీఎన్‌జీ రీఫ్యూయలింగ్ స్టేషన్లు అందుబాటులోకి రావడం అన్నీ జరుగుతున్నాయి. ఈ తరుణంలో చాలామంది పెట్రోల్ కార్ల స్థానంలో సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కథనంలో రూ. 10 లక్షల కంటే తక్కువ ధర వద్ద లభించే ఉత్తమ సిఎన్‌జీ కార్లను గురించి తెలుసుకుందాం.

మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్‌జీ
ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్‌జీ కార్లలో ఒకటి 'మారుతి సుజుకి ఆల్టో కే10'. ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ కారు ధరలు రూ. 5.8 లక్షలు, రూ. 6.04 లక్షలు. ఇందులోని 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ 5300 rpm వద్ద 56 Bhp పవర్, 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ పొందుతుంది. ఈ కారు 33.85 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని సమాచారం.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్‌జీ
ఇది కూడా ఎల్ఎక్స్ఐ (ఓ), వీఎక్స్ఐ (ఓ) అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు వరుసగా రూ. 5.91 లక్షలు, రూ. 6.11 లక్షలు. ఈ కారులో 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 56 Bhp పవర్, 82.1 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. ఇది 32.73 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.

టాటా టియాగో సీఎన్‌జీ
టాటా టియాగో సీఎన్‌జీ ధరలు రూ. 6 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో ట్విన్ సిలిండర్ CNG ట్యాంక్ ఉంటుంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన సీఎన్జీ కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ కారు ఐదు మాన్యువల్, మూడు ఆటోమాటిక్ వేరియంట్లలో లభిస్తుంది. మాన్యువల్ ధరలు రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.19 లక్షల మధ్య ఉన్నాయి. ఆటోమాటిక్ ధరలు రూ. 7.84 లక్షల నుంచి రూ. 8.74 లక్షల మధ్య ఉన్నాయి.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ
మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ.. ఎల్‌ఎక్స్‌ఐ (ఓ), విఎక్స్‌ఐ (ఓ) అనే రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 6.54 లక్షల నుంచి రూ. 6.99 లక్షల వరకు ఉంటాయి. ఇది 998 సీసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ ద్వారా 5300 ఆర్‌పీఎమ్ వద్ద 56 బిహెచ్‌పీ పవర్ఉ.. 3400 ఆర్‌పీఎమ్ వద్ద 82.1 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని మైలేజ్ 33.47 కిమీ/కేజీ వరకు ఉంది.

ఇదీ చదవండి: అమ్మకాల్లో టాప్ కంపెనీలు.. ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే!

మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ
మారుతి సుజుకి సెలెరియో సీఎన్‌జీ.. భారతదేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్లలో ఒకటి. దీని ధర రూ. 6.90 లక్షలు. ఇది 34 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది. ఈ కారులోని 998 సీసీ ఇంజిన్ 5300 rpm వద్ద, 55.92 Bhp పవర్ & 3400 rpm వద్ద 82.1 Nm టార్క్ అందిస్తుంది.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)