Breaking News

రూ.10 వేలకే వచ్చే లేటెస్ట్‌ బెస్ట్‌ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు

Published on Fri, 08/01/2025 - 12:15

ప్రతి నెలా ఏవో కొత్త ఫోన్లు వస్తూనే ఉంటాయి. అయితే వినియోగదారుడి అవసరాలకు సరిపోయే, బడ్జెట్‌కు తగిన  స్మార్ట్‌ఫోన్‌లు కొన్నే ఉంటాయి. వాటిని ఎంచుకోవడం కష్టమైన పనిగా మారింది. ఈ నేపథ్యంలో సామాన్య వినియోగదారులకు బడ్జెట్‌లో అంటే రూ.10 వేల లోపు ధరలో జూలైలో వచ్చిన కొన్ని బెస్ట్‌ 5జీ స్మార్ట్‌ ఫోన్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.

శాంసంగ్ ఎం06 5జీ
🔹శాంసంగ్ ఎం06 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, ఆర్మ్ మాలి జీ57 ఎంసీ2 జీపీయూ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది. 4/6 జీబీ LPDDR4X ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు

🔹వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ షూటర్ ఉంది.

🔹సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, సింగిల్ బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉన్నాయి. 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.

ఇన్ఫినిక్స్ హాట్ 60
🔹ఇన్ఫినిక్స్ హాట్ 60లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ పంచ్ హోల్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. ఇది 7.8 మిమీ మందంతో ఉంటుంది. వాటర్‌, డస్ట్‌ ప్రూఫ్‌ కోసం ఐపీ 64 రేటింగ్ పొందింది. అంటే ఇది స్ప్లాష్‌లు, తేలికపాటి నీటి చుక్కలు పడినా ఏమీకాదు.

🔹హాట్ 60 5జీ + మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్ఓసీతో పనిచేస్తుంది.  ఈ ఫోన్ సింగిల్ 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా 2 టీబీ వరకు అదనపు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు.

🔹హాట్ 60 5జీ ప్లస్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, ఎల్ఈడీ ఫ్లాష్ సపోర్ట్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 15 ఆధారిత కొత్త ఎక్స్ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఇది పనిచేస్తుంది.

🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

లావా స్టార్మ్ ప్లే
🔹లావా స్టార్మ్ ప్లే ఫోన్‌లో 6.75 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ​ మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, 6 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 128 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

🔹50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 752 ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.

🔹18వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

ఐక్యూ జెడ్10 లైట్ 5జీ
🔹ఐక్యూ జెడ్10 లైట్ 6.74 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ఎల్ పీడీడీఆర్ 4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్, మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా  1 టీబీ ఎక్స్ టర్నల్ స్టోరేజ్ పొందవచ్చు.

🔹ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 15వాట్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.

🔹ఆప్టిక్స్ విషయానికి వస్తే, జెడ్ 10 లైట్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ షూటర్ కూడా ఉంది.
 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)