Breaking News

లూడో తెచ్చిన ముప్పు: లక్షలు గోవిందా! చివరికి..!

Published on Mon, 08/14/2023 - 20:32

Online Gaming Ludo Bangalore Woman ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన మహిళ లక్షలు పోగొట్టుకున్న వైనం ఆందోళన రేపింది. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ గేమింగ్‌ ఒక  వ్యసనంలా మారిపోతోంది. ఈక్రమంలో భారీగా నష్టపోతున్న  బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బెంగ‌ళూర్‌కు చెందిన ఓ మ‌హిళ  ఏకంగా రూ. 4 ల‌క్ష‌లు పోగొట్టుకుంది. అంతేకాదు  ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన  మ‌హిళ   కొంత నగదుతో సహా  ఇంటి నుంచి పారిపోవడం మరింత  సంచలనం రేపింది.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ కథన ప్రకారం బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల వివాహిత ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైంది. ఈ క్రమంలో లూడో ఆడుతూ రూ.4 లక్షలకు పైగా పోగొట్టు కుంది. అయితే ఆన్‌లైనింగ్‌ వ్యసనం గత ఏడాదినుంచే ఉంది. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టిమరీ ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతూ ఉండటం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో గతంలో  రూ. 50వేల పోగొట్టుకుంది.  రూ. 1.25 లక్షల విలువైన తన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టింది. అంతేకాదు,కుటుంబ సభ్యులు భర్తకు చెప్పకుండా బంధువుల వద్ద రూ.1.75 లక్షలు అప్పు తీసుకోవడం గమనార్హం.

అయితే విషయం తెలిసిన భర్త ఆమెను మందలించాడు. మళ్లీ  అలాంటి   పొరపాటు జరగదని భర్తకు హామీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది జూలైలో ఆన్‌లైన్‌లో లూడో ఆడేందుకు ఆ మహిళ మరోసారి తన బంగారు ఆభరణాలను రూ.1.20 లక్షలకు తాకట్టు పెట్టింది. ఈసారి ఏకంగా నాలుగు  లక్షల రూపాయలు స్వాహా అయిపోయాయి. దీంతో ఆమె భర్త జోక్యం చేసుకుని  భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు కూడా గేమ్‌ను కొనసాగించవద్దని మందలించారు. దీంతో ఆ మ‌హిళ  ఆగస్టు 8న, ఇంట్లో ఉన్న న‌గ‌దుతో పాటు ఇద్ద‌రు పిల్ల‌ల‌నూ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. "నేను క్షమాపణలు కోరుతున్నాను, నేను ఇంట్లో ఉంచిన డబ్బు తీసుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించు" అంటూ ఒక నోట్‌  కూడా పెట్టి ంది. దీంతో ఇక చేసేదేమీ లేక .భ‌ర్త పోలీసులను ఆశ్రయించాడు.  అతని ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు వారిఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)