Breaking News

ఐటీ సిటీలో డబుల్‌ ట్యాక్స్‌.. ఇంటి అద్దెలు మరింత పెరుగుతాయా?

Published on Sun, 02/25/2024 - 19:34

బృహత్ బెంగళూరు మహానగర పాలికె మార్గదర్శక విలువ ఆధారిత ఆస్తిపన్నును ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో బెంగళూరు నగరంలోని నివాస, కమర్షియల్‌ భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులపై అదనపు భారం పడబోతోంది. ఆస్తిపన్ను విలువలలో ఈ భారీ పెరుగుదల ఇప్పటికే అధిక అద్దెల భారం మోస్తున్నవారిపై మరింత భారాన్ని పెంచే అవకాశం ఉంది. 

కొత్త ఆస్తి పన్ను విధానం ప్రకారం.. యజమానులు తామె స్వయంగా నివాసం ఉంటున్న ఆస్తులపై చెల్లించే పన్నుతో పోలిస్తే అద్దెకు ఇచ్చిన ఆస్తులపై రెండింతలు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇతర వాణిజ్య భవనాల విషయానికి వస్తే పన్ను 3-5 రెట్లు పెరగనుంది.

కొత్త ఆస్తి పన్ను విధానం ఇదీ..
ప్రస్తుత పన్ను విధానంలో పీజీలు, కన్వెన్షన్‌ హాళ్లు, లేదా మాల్స్ వంటి అద్దె ఆస్తులకు ఏడు సుంకాలు ఉన్నాయి. అయితే ఎయిర్ కండీషనర్ లేదా ఎస్కలేటర్లు ఉన్న భవనాలకు ప్రత్యేకంగా పన్నులేమీ విధించడం లేదు. గైడెన్స్ విలువను 33 శాతం పెంచినందున వ్యాపారులు, ఆస్తి యజమానులు వార్షిక బీబీఎంపీ పన్నులో కనీసం 40 శాతం పెరుగుతుందని  ఆందోళన చెందుతున్నారు. అయితే బీబీఎంపీ కొత్త నోటిఫికేషన్‌లో ఆస్తి పన్ను పెంపును 20 శాతానికి పరిమితం చేసింది.

బెంగళూరు నగరంలోని అద్దె ఇళ్లు, ఫ్లాట్‌లపై బీబీఎంపీ రెట్టింపు పన్నులు వేస్తోందని, అయినప్పటికీ తమకు ఎలాంటి ప్రయోజనాలు కల్పించడం లేదని నగరంలో అద్దె నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. "కొత్త పన్ను నియమంతో అద్దెదారులు అదనపు ఖర్చును భరించవలసి ఉంటుందని వాపోతున్నారు. అయితే ఆస్తి పన్ను 5 శాతానికి మించి పెరగదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బీబీఎంపీ అధికారులు చెబుతున్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)