Breaking News

‘నింగిలో నివాసం’.. బెంగళూరు కంపెనీ ప్రయత్నం

Published on Thu, 07/11/2024 - 16:46

బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఆకాశలబ్ధి వినూత్న ప్రయత్నం చేస్తోంది. వ్యోమగాములు, పరిశోధకులు, అంతరిక్ష పర్యాటకులకు ఆతిథ్యం ఇవ్వడానికి అంతరిక్షంలో నివాసాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోంది.

ఆరు నుంచి 16 మందికి వసతి కల్పించేలా అంతరిక్ష నివాస పరిష్కారాన్ని రూపొందిస్తోంది ఆకాశలబ్ధి. దీనికి సంబంధించిన వివరాలను లింక్డ్‌ఇన్‌లో వెల్లడించింది.  దీన్ని 'తారల మధ్య ఇల్లు'గా పేర్కొంది. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. 'అంతరిక్ష్ హబ్‌' పేరుతో ఆవాస నమూనాను ఆకాశలబ్ధి సిద్ధం చేసింది.  

'అంతరిక్ష్ హబ్‌' అనేది విస్తరించదగిన షెల్ వంటి నిర్మాణం. ఇది అసాధారణమైన అంతరిక్ష శిధిలాలు, రేడియేషన్ నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతరిక్షంలో నివాసంతో పాటు బహుళ ప్రయోజనాల కోసం వినియోగించేలా దీని డిజైన్‌ను రూపొందిస్తున్నారు. 'అంతరిక్ష్ హబ్‌'ని మైక్రోగ్రావిటీ ప్రయోగాలు, ఉపగ్రహ నిర్వహణ, కక్ష్య రవాణా నిల్వ కోసం ఉపయోగించవచ్చు.

తాము చేస్తున్న ప్రయత్నం మున్ముందు చంద్రుడిపైనా ఆవాస అన్వేషణకు తోడ్పడుతుందని కంపెనీ తమ వెబ్‌సైట్‌లో పేర్కొంది. నిర్మాణం అనుకున్న గమ్యాన్ని చేరుకున్న తర్వాత పూర్తిగా ఏర్పాటు చేయడానికి సుమారు ఏడు రోజులు పడుతుందని ఆకాశలబ్ధి సీఈవో సిద్దార్థ్ జెనా చెప్పారు. కాగా మిషన్ కోసం స్లాట్‌ను బుక్ చేయడానికి ఈ కంపెనీ ఇలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)