Breaking News

ఆ నాలుగు రాష్ట్రాల వారికి ఇక ఉద్యోగాలు ఇవ్వం!

Published on Wed, 09/23/2026 - 14:00

కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల ఎంపిక, అర్హతలు, నైతిక ప్రవర్తన ఆధారంగా జరుగుతుంటుంది. కానీ, ఒక ఉద్యోగి చేసిన పొరపాటుకు ఏకంగా నాలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులపై నిషేధం విధిస్తూ బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సీఈఓ తీసుకున్న నిర్ణయం ఐటీ, స్టార్టప్ వర్గాల్లో దుమారం రేపుతోంది.

‘ఏ1 స్పోర్ట్స్ వరల్డ్’ ఫౌండర్, సీఈఓ కార్తిక్ ఎస్‌జీ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ప్రకారం.. ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పురుష అభ్యర్థులను తమ కంపెనీలోకి ఇకపై తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇటీవల ఉత్తరాదికి చెందిన ఒక మాజీ ఉద్యోగి అక్కడి మహిళా సిబ్బంది పట్ల వేధింపులకు పాల్పడటం, హెచ్చరించినా వైఖరి మార్చుకోకపోవడంతో అతడిని తొలగించామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తమ సంస్థలోని 14 మంది మహిళా ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు.

ప్రాంతీయ వివక్షా?

ఈ నిర్ణయం నెట్టింట చర్చకు దారితీసింది. ఒకరి వ్యక్తిగత ప్రవర్తనకు ఒక ప్రాంతం లేదా రాష్ట్రం మొత్తాన్ని బాధ్యులను చేస్తూ నిషేధించడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు, సమానత్వ హక్కులకు విరుద్ధమని నిపుణులు, నెటిజన్లు ఆక్షేపిస్తున్నారు. అర్హతలను పక్కనపెట్టి ప్రాంతీయ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం కార్పొరేట్ సంస్కృతికే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

అయితే, ‘నా కంపెనీ– నా నిబంధనలు’ అని సమర్థించుకున్న సీఈఓ, తమ కంపెనీలో మొత్తం 32 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో ఇతర రాష్ట్రాల వారు, ముఖ్యంగా దక్షిణేతర రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా సురక్షితంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.

లీగల్, హెచ్‌ఆర్ వర్గాల ఆందోళన

ఈ పరిణామంపై కార్పొరేట్ న్యాయ నిపుణులు, హెచ్‌ఆర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పనివేళల్లో మహిళల భద్రత కోసం గైడ్‌లైన్స్, చట్టాలు స్పష్టంగా ఉన్నప్పుడు అభ్యర్థుల ప్రాంతీయ గుర్తింపును బట్టి నిషేధం విధించడం చట్టబద్ధంగా నిలవదని పేర్కొంటున్నారు. కార్పొరేట్ నిర్ణయాలు చట్టపరిమితులకు లోబడి ఉండాలే తప్ప వ్యక్తిగత ఆగ్రహంతో తీసుకునేవిగా ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పరుగులు తీస్తున్న బంగారం ధరలు.. ఈరోజు రేటు ఎంతంటే..

#

Tags : 1

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)