Breaking News

‘అసలే ఎన్నికలు’, బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పనుందా?

Published on Sat, 10/28/2023 - 13:26

ప్రభుత్వ బ్యాంక్‌ ఉద్యోగులకు శుభవార్త. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వారానికి ఐదు రోజుల పని దినాలను కేంద్ర ఆర్థిక శాఖ అతి త్వరలోనే అమలు చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు వేతనాల్ని సగటున 15 శాతం పెంపుపై బ్యాంకులు - బ్యాంకు యూనియన్‌ సంఘాలు చర్చిస్తున్నాయి.  

ఐదు రోజుల పనిదినాలను కల్పించేందుకు భారత బ్యాంకుల సంఘం (ఐబీఏ) కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపింది. తాజాగా, ఉద్యోగులు వేతనాల్ని 15 శాతం పెంపును ప్రతిపాదించింది. అయితే, పనిదినాల మార్పులతో పాటు వేతనాల శాతాన్ని మరింత పెంచాలని బ్యాంకు యూనియన్లు కోరుతున్నాయి. ఇప్పటికే పీఎన్‌బీ వంటి కొన్ని బ్యాంకులు వేతనాల పెంపుకు పెద్దమొత్తంలో కేటాయింపులు జరుపుతున్నాయి. సెప్టెంబర్ త్రైమాసికంలో ఉద్యోగుల వేతనం 10 శాతం పెరిగేలా బడ్జెట్‌ కేటాయించడానికి బదులుగా, 15శాతం పెరుగుదల కోసం నిధులను కేటాయించింది.

నిశితంగా పరిశిలీస్తున్న కేంద్రం
‘ఇటీవలి కాలంలో బ్యాంకుల లాభాలు బాగా పెరిగాయని, కొవిడ్ సమయంలో పనిచేయడం, ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు రుణదాతలను తిరిగి గాడిలో పెట్టడానికి ఉద్యోగులు చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుంటే తమకు మెరుగైన పరిహారం లభిస్తుందని’ ఉద్యోగులు, యూనియన్లు వాదించుకుంటున్నాయి. ఈ చర్చలను ఆర్థిక మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోంది.

అసలే ఎన్నికలు
అధిక సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు ఉన్నందున వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు కంటే ముందే వేతన సెటిల్ మెంట్‌తో పాటు వారానికి ఐదురోజుల పనికి కేంద్రం ఆమోదం తెలుపుతుందని బ్యాంక్‌ ఉద్యోగులు, యూనియన్‌ సంఘాలు అంచనా వేస్తున్నాయి.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)