Breaking News

బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ‘మినిమం’ చార్జీల ఎత్తివేత

Published on Wed, 07/09/2025 - 01:01

ముంబై: ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీవోఐ) సేవింగ్స్‌ ఖాతాలకు సంబంధించి కనీస నిల్వ(మినిమం బ్యాలెన్స్‌) పెనాల్టీ చార్జీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, కొన్ని రకాల డిపాజిట్లు, రుణ రేట్లను సైతం సవరించింది. 999 రోజులకు సంబంధించి గ్రీన్‌ డిపాజిట్‌పై వడ్డీ రేటును 7% నుంచి 6.7 శాతానికి తగ్గించింది. రూ.లక్ష నుంచి రూ.10 కోట్ల మధ్య డిపాజిట్లకు ఈ రేటు అమలవుతుంది. సేవింగ్స్‌ ఖాతాలోని డిపాజిట్లపై రేటును 2.7% (వార్షిక) నుంచి 2.5 శాతానికి తగ్గించింది. ఇక గృహ రుణ రేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

ఇప్పటికే తీసుకున్న గృహ రుణాలతోపాటు కొత్తగా తీసుకునే గృహ రుణాలకు ఇది అమలవుతుందని తెలిపింది. సవరణ తర్వాత గృహ రుణాలపై వడ్డీ రేటు 7.35% నుంచి ప్రారంభమవుతుంది. రుణ గ్రహీత సిబిల్‌ స్కోరు ఆధారంగా ఈ రేటు మారుతుంది. ప్రతిష్టాత్మక ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందేవారికి 7.5% రేటుకే విద్యా రుణాలను ఆఫర్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. వాహన రుణాలపైనా అర శాతం రేటు తగ్గించినట్టు తెలిపింది. ఈ నిర్ణయాలు ఈ నెల 7 నుంచే అమల్లోకి వచి్చనట్టు పేర్కొంది. ఇప్పటికే ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఇండియన్‌ బ్యాంక్‌ సైతం సేవింగ్స్‌ ఖాతాలకు సంబంధించి కనీస బ్యాలన్స్‌ పెనాల్టీ చార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)