Breaking News

బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త! వారానికి రెండు రోజులు...

Published on Wed, 03/01/2023 - 20:49

బ్యాంక్ ఉద్యోగులకు శుభవార్త ఇది. వారంలో ఐదు రోజులే పనిదినాలు ఉండాలన్న బ్యాంకు యూనియన్ల డిమాండ్‌ను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ (ఐబీఏ) పరిశీలిస్తోందని, ఇది అమలయితే వారికి త్వరలో రెండు రోజుల వీక్లీ ఆఫ్‌లు లభిస్తాయని న్యూస్‌ 18 కథనం పేర్కొంది.

అయితే వారంలో ఐదు రోజుల పనిదినాల విధానం అమలైతే రోజువారీ పని గంటలను రోజుకు 50 నిమిషాలు పెంచవచ్చని తెలిపింది. ఈ విషయంలో ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (యూఎఫ్‌బీఈఎస్‌) మధ్య చర్చలు జరుగుతున్నాయి. అసోసియేషన్ ఐదు రోజుల పనిదినాల విధానానికి సూత్రప్రాయంగా అంగీకరించింది.

(ఇదీ చదవండి: ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్‌ ఎస్టేట్‌ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..)

నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 25 ప్రకారం ప్రభుత్వం అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాల్సి ఉంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ నాగరాజన్‌ చెప్పినట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు రెండు, నాలుగో శనివారాల్లో మాత్రమే పని చేస్తున్నారు. కొత్త విధానంలో ఉద్యోగులు రోజూ ఉదయం 9.45 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అదనంగా 40 నిమిషాలు పని చేయాల్సి ఉండొచ్చని భావిస్తోంది.

మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్‌!
మార్చి నెలలో రెండవ, నాలుగో శనివారాలు, ఆదివారాలతో సహా 12 రోజుల వరకు బ్యాంకులు మూత పడనున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని బ్యాంకులకు సాధారణ సెలవులు ఉండగా మరికొన్నింటికి స్థానిక సెలవులు ఉన్నాయి.

(ఇదీ చదవండి: ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై.. సరికొత్త ఫీచర్లు!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)