Breaking News

కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌!

Published on Wed, 01/11/2023 - 08:51

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) నిధుల సమీకరణ వ్యయ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటును 35 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. దీనితో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన రుణ రేట్లు మరింత పెరగనున్నాయి. కొత్త రేటు జనవరి 12వ తేదీ నుంచి అమలవుతుంది. బ్యాంక్‌ తాజా నిర్ణయంతో ఓవర్‌నైట్‌ ఎంసీఎల్‌ఆర్‌ 7.50 శాతం నుంచి 7.85 శాతానికి చేరింది.

నెల, మూడు, ఆరు, ఏడాది రేట్లు వరుసగా 8.15 శాతం, 8.25 శాతం, 8.35 శాతం, 8.50 శాతాలకు పెరిగాయి. పలు వాహన, వ్యక్తిగత, గృహ రుణాలకు ఏడాది రుణ రేటు అనుసంధానమై ఉండే సంగతి తెలిసిందే. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌లు సోమవారం రుణ రేటను 25 బేసిస్‌ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. 

ఐఓబీ డిపాజిట్ల రేట్లు అప్‌ 
కాగా, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న  ప్రభుత్వ రంగం ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్‌  (ఐఓబీ)రిటైల్‌ డిపాజిట్‌ రేటును తక్షణం అమల్లోకి వచ్చే విధంగా 45 బేసిస్‌ పాయింట్లు  పెంచింది. దీని ప్రకారం 444 రోజుల కాలానికి డిపాజిట్లపై 7.75 శాతం రేటు అమలవుతుంది. ఫారిన్‌ కరెన్సీ డిపాజిట్‌ రేటును కూడా మంగళవారం నుంచి బ్యాంక్‌ 1% పెంచింది. దీనితో ఈ రేటు 5 శాతానికి చేరింది.

చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు!

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)