Breaking News

బజాజ్ పల్సర్ ఎన్150 ఇక కనుమరుగు!

Published on Sat, 07/12/2025 - 20:33

ఎంతో పాపులర్‌ అయిన బజాజ్ పల్సర్ ఎన్150 ఇక కనుమరుగు కానుంది. ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల భారత మార్కెట్ కోసం పల్సర్ ఎన్ఎస్ 400 జెడ్ ను అప్ డేట్ చేసింది. అయితే ఈ బ్రాండ్ నిశ్శబ్దంగా పల్సర్ ఎన్ 150 ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. పల్సర్ ఎన్ 160 కింద ఉన్న ఈ బైక్ ను బ్రాండ్ అధికారిక వెబ్ సైట్ నుంచి తొలగించారు. దీన్ని వెబ్ సైట్ నుంచి ఎందుకు తొలగించారన్నది తెలియరాలేదు.

అత్యంత ఆదరణ ఉన్న పల్సర్ లైనప్‌లో రెండు 150 సీసీ పల్సర్లు ఉండేవి. వీటిలో ఒకటి క్లాసిక్ పల్సర్ 150 కాగా మరొకటి పల్సర్ ఎన్ 150. క్లాసిక్ పల్సర్ 150కు అప్‌డేటెడ్‌ స్పోర్టీ లుక్‌తో పల్సర్ ఎన్ 150 బైక్‌ను తీసుకొచ్చారు. డిజైన్, లుక్‌ పల్సర్ ఎన్ 160 మాదిరిగానే ఉన్న ఈ బైక్‌ కొనుగోలుదారులలో ఆదరణ పొందిన ఎంపికగా కొనసాగుతోంది.

పల్సర్ ఎన్ 150 స్పెక్స్‌ విషయానికి వస్తే.. సొగసైన ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ దీనికి ఉంది. ఇది ప్రసిద్ధ పల్సర్ హెడ్ ల్యాంప్స్ అధునాతన వెర్షన్ ను సూచిస్తుంది. అంతేకాకుండా మస్కులార్‌ ఇంధన ట్యాంక్‌ దీనిస్పోర్టీ వెయిస్ట్‌లైన్‌కు భిన్నంగా ఉంటుంది. ఎన్ 160లో ఉన్నట్టుగానే డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్, ఫ్యూయల్ ట్యాంక్ పై యూఎస్‌బీ పోర్ట్, స్పీడోమీటర్ ఉన్నాయి.

పల్సర్ ఎన్ 150 బైకులో 149.68 సీసీ, ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఉంది. ఇది 14.5బిహెచ్ పి పవర్, 13.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్ మిషన్ తో వస్తున్న ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, సస్పెన్షన్ కోసం వెనుక భాగంలో మోనోషాక్ సెటప్ ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం, స్పోర్ట్ బైక్ ముందు భాగంలో సింగిల్-ఛానల్ ఎబిఎస్ తో కూడిన 240 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ను అమర్చారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)