బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్
Breaking News
'మళ్లీ మోసం చేయడానికి వచ్చారు'.. మసెరటిపై సింఘానియా ఫైర్!
Published on Mon, 11/02/2026 - 07:01
లగ్జరీ కార్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మసెరాటి కంపెనీపై రేమండ్ గ్రూప్ ఛైర్మన్, ఎండీ గౌతమ్ సింఘానియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మసెరాటి కారును కొనుగోలు చేయాలనుకునే వారు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని ఆయన సూచించారు. గతంలో తాను కంపెనీ దృష్టికి తీసుకెళ్లిన సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
మసెరాటి భారతీయ విఫణిలో.. తన కొత్త కార్లను పరిచయం చేస్తున్న సమయంలో, సింఘానియా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌లో MC20 కారుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. కంపెనీపై విమర్శలు చేశారు.
''మసెరాటి మళ్లీ భారత్‌లోకి వస్తోంది. ఈ కార్లను కొనేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. నేను గతంలో చెప్పిన సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. దానికి సమాధానం చెప్పడానికి కూడా కంపెనీ దగ్గర ఏమీ లేదు. భారతీయ కస్టమర్లను మోసం చేయడానికి మళ్లీ ఎలా వస్తున్నారో నమ్మలేకపోతున్నాను'' అంటూ ఘాటుగా స్పందించారు.
అందుకే.. మసెరాటి MC20 కారుపై అసంతృప్తి!
సింఘానియా షేర్ చేసిన వీడియోలో మసెరాటి MC20 సూపర్‌కార్ రైడ్ క్వాలిటీపై ఒక ప్రెజెంటర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ కారు సస్పెన్షన్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. GT మోడ్‌లో కారును నడుపుతూ, సస్పెన్షన్‌ను అత్యంత సాఫ్ట్ సెట్టింగ్‌లో ఉంచినప్పటికీ ప్రయాణం ఏమాత్రం సౌకర్యంగా లేదని చెప్పారు.
కారులో బిల్‌స్టెయిన్ డాంప్‌ట్రానిక్ ఎక్స్ సస్పెన్షన్ టెక్నాలజీ ఉన్నప్పటికీ రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు కారు ఎక్కువగా కదులుతోందని అన్నారు. ముఖ్యంగా రోడ్డు కొద్దిగా ఎగుడుదిగుడుగా ఉన్నా.. కారు కదలికలు ఎక్కువగా ఉన్నాయని, ప్రయాణం చాలా అసౌకర్యంగా అనిపించిందని వివరించారు. కారు కదలికలకు కెమెరా కూడా కింద పడిపోతుందేమోనని భయపడుతున్నట్లు చెప్పారు.
ఆ తర్వాత Sport మోడ్‌లో కూడా కారును పరీక్షించారు. అయితే.. ఈ మోడ్‌లో సస్పెన్షన్ మరింత గట్టిగా మారిందని, ప్రయాణం ఇంకా జర్కీగా అనిపించిందని పేర్కొన్నారు. మొత్తంగా MC20 కారు రైడ్ క్వాలిటీ తన అంచనాలకు తగ్గట్టుగా లేదని అభిప్రాయపడ్డారు.
అయితే.. ఇవన్నీ వీడియోలో పరీక్షించిన MC20 కారుకు సంబంధించిన అభిప్రాయాలు మాత్రమే. మసెరాటి కంపెనీకి చెందిన అన్ని కార్లలోనూ ఇలాంటి సమస్య ఉందని చెప్పడానికి ఆధారాలు లేవు.
భారత్‌లో కొత్త మసెరాటి కార్లు
భారతదేశంలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు మసెరాటి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే.. అక్టోబర్ 30న నిర్వహించిన కార్యక్రమంలో పలు కొత్త, అప్‌డేటెడ్ కార్లను పరిచయం చేసింది. ఇందులో గ్రెకేల్, గ్రాన్‌టూరిస్మో, గ్రాన్‌కాబ్రియోలతో పాటు జీటీ2 స్ట్రాడేల్, ఎంసీపూర మోడల్స్ ఉన్నాయి. అంతే కాకుండా.. నవ్‌నిత్ మోటార్స్‌తో కలిసి ముంబైలో తమ కొత్త డీలర్‌షిప్‌ను ప్రారంభించింది. ఇది భారత్‌లో మసెరాటికి మూడో ఫ్లాగ్‌షిప్ డీలర్‌షిప్. కాగా.. ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో కూడా కంపెనీ షోరూమ్‌లు ఉన్నాయి.
ఇదీ చదవండి: 2027లో లాంచ్ అయ్యే కొత్త కార్లు!
గౌతమ్ సింఘానియా కార్ కలెక్షన్
గౌతమ్ సింఘానియాకు కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే.. తన గ్యారేజిలో ఫెరారీ లాఫెరారీ, మెక్‌లారెన్ సెన్నా, మెక్‌లారెన్ 720ఎస్, లంబోర్ఘిని కౌంటాచ్, ఫెరారీ 296 స్పెషలే వంటి ఎన్నో ఖరీదైన సూపర్‌కార్లు ఉన్నాయి. ఆయన వద్ద మసెరాటి MC20 కారు కూడా ఉంది.
Tags : 1