Breaking News

‘సినిమా టికెట్ ధరలు భారం కావు’ సగటు ధర ఎంతంటే..

Published on Mon, 12/29/2025 - 10:01

మల్టీప్లెక్స్ థియేటర్లలో సినిమా చూడటం సామాన్యులకు భారంగా మారుతోందన్న విమర్శలపై పీవీఆర్ ఇనాక్స్ (PVR INOX) మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ వివరణ ఇచ్చారు. పీవీఆర్ సినిమాస్ టికెట్ ధరలు, స్నాక్స్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయనే ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కంపెనీ అధికారిక గణాంకాలతో కూడిన వివరాలను వెల్లడించారు. 2025 డిసెంబర్ నాటి ఆర్థిక నివేదికల ప్రకారం, పీవీఆర్ నెట్‌వర్క్‌లో సగటు టికెట్ ధర రూ.259 మాత్రమే ఉందని పేర్కొన్నారు.

విమర్శలపై వివరణ

చాలామంది ప్రేక్షకులు లగ్జరీ స్క్రీన్లు లేదా ప్రీమియం థియేటర్ల ధరలను చూసి మొత్తం చైన్(పీవీఆర్‌ ఐనాక్స్‌లోని అన్ని థియేటర్లు) అంతా అలాగే ఉంటుందని అపోహ పడుతున్నారని ఆయన అన్నారు. ‘లగ్జరీ స్క్రీన్లలో ధరలు రూ.600-700 ఉండొచ్చు. కానీ అది అందరికీ కాదు. హెడ్‌లైన్స్ చూసి ప్రజలు నిర్ణయానికి వస్తున్నారు తప్ప, పూర్తి వివరాలు చూడటం లేదు’ అని అసహనం వ్యక్తం చేశారు. పాప్‌కార్న్ ధరలపై వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. సాధారణ పాప్‌కార్న్ ధర కేవలం రూ.159 నుంచే మొదలవుతుందని, రూ.400 వరకు ఉండే పాప్‌కార్న్ బకెట్లపై ‘అన్‌లిమిటెడ్ రిఫిల్స్’ సౌకర్యం ఉంటుందని ఆయన వివరించారు.

ప్రేక్షకులకు ఆఫర్లు

సామాన్య ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు పీవీఆర్ ఇనాక్స్ పలు రకాల స్కీమ్స్‌ను అమలు చేస్తున్నట్లు చెప్పారు. కొన్ని స్క్రీన్లల్లో మంగళవారాల్లో టికెట్ ధరలను రూ.95 - రూ.100 వరకు తగ్గించి సామాన్యులకు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. వారాంతాల్లో ఫుడ్ ఐటమ్స్ మీద ప్రత్యేక రాయితీలు, అన్‌లిమిటెడ్ రిఫిల్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘పీవీఆర్ పాస్’ వంటి మంత్లీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ల ద్వారా తక్కువ ధరకే ఎక్కువ సినిమాలు చూసే వీలు​ందని చెప్పారు.

బిగ్ స్క్రీన్ అనుభవం

ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చినా బిగ్ స్క్రీన్ ఇచ్చే అనుభవం ఎప్పటికీ ప్రత్యేకమేనని బిజ్లీ అభిప్రాయపడ్డారు. అత్యాధునిక సౌండ్ సిస్టమ్స్, కంఫర్టబుల్ సీటింగ్‌, హై-క్వాలిటీ విజువల్స్ అందించడానికి రూ.259 సగటు ధర అనేది అత్యంత సమంజసమైనదని సమర్థించుకున్నారు.

ఇదీ చదవండి: గ్రామీణ క్రెడిట్ స్కోర్‌తో అప్పు!?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)