Breaking News

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సగటు క్లెయిమ్‌ రూ.42,000 

Published on Mon, 07/03/2023 - 07:53

న్యూఢిల్లీ: దేశంలో సగటు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ మొత్తం రూ.42,000గా ఉంది. మొత్తం మీద 15 శాతం క్లెయిమ్‌లు మాత్రమే రూ.లక్ష మించి ఉంటున్నాయి. సెక్యూర్‌ నౌ ఈ వివరాలను ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. హాస్పిటల్‌లో 5 రోజులకు పైగా ఉండి చికిత్స తీసుకోవాల్సి వచ్చినప్పుడు, క్లెయిమ్‌ రూ.5 లక్షలు మించుతుందనే విషయాన్ని పాలసీదారులు పరిగణనలోకి తీసుకోవాలని.. అలాగే, బీమా సంస్థలు సైతం పాలసీల రూపకల్పనలో ఈ విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని నివేదిక ప్రస్తావించింది.

రీయింబర్స్‌మెంట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లను పరిశీలించినప్పుడు.. హాస్పిటల్‌లో ఎన్ని రోజులు ఉంటున్నారు, క్లెయిమ్‌ మొత్తం? పరిష్కార శాతం, భారత్‌లో క్లెయిమ్‌ పరిష్కార ప్రక్రియలో సమర్థత అంశాలు తెలుస్తాయని సూచించింది. 3,846 రీయింబర్స్‌మెంట్‌ క్లెయిమ్‌ల పత్రాలను సెక్యూర్‌నౌ విశ్లేషించింది. భౌగోళికంగా భిన్న ప్రాంతాలు, వివిధ బీమా సంస్థల క్లెయిమ్‌లను పరిశీలించినప్పుడు ఈ అంశాలు తెలిశాయి.

క్లెయిమ్‌లలో 3 శాతం ప్రమాదం కారణంగా ఉంటున్నాయి. వీటి సగటు క్లెయిమ్‌ రూ.33,000గా ఉంటోంది. హాస్పిటల్‌లో ఎన్ని రోజులు ఉంటున్నారనేది హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లలో కీలక అంశంగా సెక్యూర్‌ నౌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్‌ సహ వ్యవస్థాపకుడు కపిల్‌ మెహతా తెలిపారు. సాధారణంగా హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకోవడం అన్నది రెండు రోజులుగా ఉంటుంటే, 21 శాతం కేసుల్లో మూడు రోజులకంటే ఎక్కువగా ఉంటున్నట్టు ఈ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. దీంతో ఎక్కువ రోజుల పాటు హాస్పిటల్‌లో చేరాల్సి వస్తే రక్షణ ఇచ్చే కాంప్రహెన్సివ్‌ కవర్‌ అవసరమని తెలిపింది. 

మేటర్నిటీ క్లెయిమ్‌లు ఎక్కువ 
50 శాతానికి పైగా క్లెయిమ్‌ల్లో పరిష్కార రేటు 80 శాతానికి పైన ఉంటోంది. మేటర్నిటీ క్లెయిమ్‌లు మొత్తం క్లెయిమ్‌ల్లో 20 శాతంగా ఉంటున్నాయి. జ్వరానికి సంబంధించి 5, కంటి సర్జరీలకు సంబంధించి 5 శాతం, ప్రమాదాలకు సంబంధించి 3 శాతం క్లెయిమ్‌లు వస్తున్నాయి. మొత్తం క్లెయిమ్‌లలో కేన్సర్‌ కేసులకు సంబంధించినవి కేవలం ఒక్క శాతంగానే ఉన్నాయి. కాకపోతే సగటు క్లెయిమ్‌ మొత్తం అధికంగా ఉంటోంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)